JEO INSPECTS ARRANGEMENTS _ రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirumala, 27 January 2023: TTD JEO Sri Veerabrahmam on Friday evening inspected the four Mada street galleries in Tirumala in connection with Radhasaptami which is scheduled on January 28.

As a part of his inspection, she visited annaprasadam, water, security, shelter and other arrangements made for the pilgrims sitting in the galleries to witness Vahana Sevas on the day of Radhasaptami.

FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, VGOs Sri Bali Reddy, Sri Manohar, Catering Special Officer Sri Shastry and others are also present.

SSD TOKENS CANCELLED FOR JAN 28

TTD has cancelled SSD tokens, privilege darshan for senior citizens and handicapped, VIP break and arjita sevas on Saturday in view of Radhasaptami. The devotees are requested to make note of this plan their Darshan accordingly.                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

 తిరుమల, 27 జనవరి 2023: తిరుమలలో శనివారం జరగనున్న రథసప్తమి పర్వదినం సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన ఏర్పాట్లను జెఈఓ శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.

గ్యాలరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో డిప్యూటేషన్ విధులు కేటాయించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిల వద్దకు భక్తులు సులువుగా వెళ్లేలా దారి ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీలకు అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
జెఈఓ వెంట టిటిడి ఎఫ్ఏసిఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి ఇతర అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.

జనవరి 28న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు

జనవరి 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.