BTU OF SRI PVS TEMPLE AT APPALAYAGUNTA FROM JUNE 2-10 _ జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 30, May 2020: TTD is organising annual Brahmotsavam of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta from June 2-10 within the temple corridors in view of Coronavirus and cancelled all vahana sevas in Mada streets.

As per schedule,  Dhwajarohanam will be performed on June 2 between 10.30 am and 11 am and Tiruchi utsava will be held daily within the temple, both in the morning and in the evening. While Srivari kalyanotsavam will be held on 

June 5 evening, Chakrasnanam will be held in Gangalam inside the temple corridor on June 10.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2020 మే 30: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాల‌ను ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. వాహనసేవల‌ ఊరేగింపును రద్దు చేశారు.

జూన్‌ 2వ తేదీ మంగళవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల‌ వరకు  ధ్వజారోహణం జరుగనుంది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. జూన్ 5న సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్‌ 10న ఉదయం 9.30 నుండి 10 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.