SRI GT REMAINS CLOSED ON JUNE 12 AND 13 _ జూన్ 12, 13వ తేదీల్లో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో భ‌క్తులకు ద‌ర్శ‌నం నిలిపివేత‌

KAINKARYAMS WILL BE PERFORMED AS USUAL

Tirupati, 12 Jun. 20: Sri Govinda Raja Swamy temple in Tirupati will remain closed on June 12 and 13 as an employee discharging duties in the temple is tested positive for Corona. However, the Kainkaryams inside the temple will take place in Ekantam.

The Old Huzur Office and PH Store will also be closed as he also wandered in these places owing to his duty chart. After sanitizing the entire premises of the temple and other places, the temple and other offices will be reopened in the Sri GT area.

The employee was confirmed positive when he went for a regular health check-up. The persons whom he met will also be identified to carry out Corona tests.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 12, 13వ తేదీల్లో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో భ‌క్తులకు ద‌ర్శ‌నం నిలిపివేత‌

తిరుపతి, 2020 జూన్ 12: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో శుక్ర‌, శ‌నివారాల్లో భ‌క్తులకు ద‌ర్శ‌నం నిలిపివేయ‌డం జ‌రుగుతుంది. స్వామివారికి కైంక‌ర్యాల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. 2 రోజుల పాటు ఆల‌యాన్ని పూర్తిగా శుద్ధి చేసిన త‌రువాత ఆదివారం నుండి య‌థావిధిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

స‌ద‌రు టిటిడి ఉద్యోగికి వేరువేరు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌డంతో రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి సంచ‌రించిన పాత హుజుర్ ఆఫీస్‌, పిహెచ్ స్టోర్‌ను కూడా రెండు రోజులు మూసివేసి శానిటైజ్ చేసిన త‌రువాత తెరుస్తారు. అదేవిధంగా, స‌ద‌రు ఉద్యోగి క‌ల‌సిన వ్య‌క్తులంద‌రినీ గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌‌డం జరుగుతుంది. ‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.