Press Release on ABHIDEYAKA ABHISHEKAM _ జూన్‌ 6వ తేది నుండి 8వ తేదివరకు వార్షిక అభిధ్యేయక అభిషేకం

Tirupati, May 26, 2009: The Annual Abhideyaka Abhishekam (Jyestabhishekam) will be conducted in Sri Vari Temple for three days from June 6 to June 8.

In view of this utsavam in Sri Vari Temple, Arjitha Sevas such as Kalyanotsavam, Unjal Seva in Ayna Mahal, Brahmotsavam, and Vasanthotsavam are cancelled on June 8. However, except Vasanthotsavam, all other arjitha sevas will be performed as usual on June 6 and June 7. The devotees who intended to participate in Abhideyaka Abhishekam have to pay Rs. 2000/- and for each ticket only five persons will be permitted.

Special programmes such as Visesha Vajra Kavacha samarpana and Vajrangi Utsavam on First day, Muttangi Samarpana and Muttangi Utsavam on second day and Abhideyaka Kavacha samarpana and utsavam on a concluding day will be performed to the utsava deities. Special nadaswaram will be arranged at Sri Vari Temple by Sri M.K.S.Siva and Sri M.K.S.Natarajan by special Nadaswaram Vidwans of Chennai during the programme.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూన్‌ 6వ తేది నుండి 8వ తేదివరకు వార్షిక అభిధ్యేయక అభిషేకం

తిరుమల, మే-26,  2009: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 6వ తేది నుండి 8వ తేదివరకు మూడురోజుల పాటు  వార్షిక అభిధ్యేయక అభిషేకం (జ్యేష్ఠాభిషేకం) ను వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీమలయప్పస్వామి వారు, ఉభయదేవేరులకు నిర్వహించే ఈ అభిధ్యేయక అభిషేకం సందర్భంగా మే 8వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఆయనమహల్‌లో ఊంజ్‌ల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలను రద్దు చేశారు. అయితే మే 6,7వ తేదిలలో ఆలయంలో వసంతోత్సవం మినహా మిగిలిన సేవలన్నీ యధావిధిగా నిర్వహిస్తారు. ఈ అభిధ్యేయక అభిషేకం నందు పాల్గొనదలచిన భక్తులు ఒక్కరోజుకుగాను రూ.2000/-లు చెల్లించాలి. ఒక టిక్కెట్టుపై ఐదు మందిని అనుమతిస్తారు.

ఈ సందర్భంగా మొదటిరోజున ఉదయం 8-11 గంటల మద్య ఉభయదేవేరులతో  కూడిన శ్రీమలయప్పస్వామివారిని సంపంగి ప్రాకారానికి తీసుకురావడం, మహాశాంతి హోమం, వార్షిక తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విశేషవజ్రకవచసమర్పణ జరుగుతుంది. రెండవరోజున ఉదయం 8-11 గంటల మద్య ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని సంపంగి ప్రాకారానికి తీసుకురావడం, మహాశాంతి హోమం, వార్షిక తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4-5.30గంటల మద్య విశేష ముత్తంగి సమర్పణ జరుగుతుంది. మూడవరోజున ఉదయం 8-12గంటల మద్య ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని సంపంగి ప్రాకారానికి తీసుకురావడం, మహాశాంతి హోమం, తిరుమంజనాదులు పూర్తయిన తర్వాత స్వర్ణకవచ ప్రతిష్ఠ జరుగుతుంది.

అభిధ్యేయక అభిషేకం(జ్యేష్ఠాభిషేకం) సందర్భంగా చెన్నైకు చెందిన నాదస్వరం విద్వాన్‌లు శ్రీయం.కె.ఎస్‌.శివ, శ్రీయం.కె.ఎస్‌.నటరాజన్‌లచే ప్రత్యేక నాదస్వర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.