Inauguration of 1st Batch of archaka training on VAIDIKA SMARTHA _ అర్చకస్వాములు శిక్షణాకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Tirupati, 26 May 2009: Dr. K.V.Ramanachary, Executive Officer, TTDs inaugurated first of Batch of Archaka Training on “VAIDIKA SMARTHA” at SVETA Bhavan, Tirupati on Tuesday morning.
 
Sri Bhuman, Director SVETA, Sri K.Rampulla Reddy, Chief Public Relations Officer and others were present on the occasion.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అర్చకస్వాములు శిక్షణాకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తిరుపతి, మే-26,  2009: అర్చకస్వాములు చిత్తశుద్ది, ఏకాగ్రతతో శిక్షణ తీసుకొని శిక్షణాకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేతనందు మొదటివిడత వైదిక స్మార్ధాగమంపై శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ అర్చకత్వానికి ఒకగౌరవం, ప్రతిష్ఠను తీసుకురావడానికి తితిదే అవిరళకృషి చేస్తున్నదని ఆయన అన్నారు. మనం చేస్తున్న పూజావిధానం ద్వారా మన కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఎటువంటి కీడు జరగకుండా వుండాలని ఆయన తెలిపారు. ఒక జిల్లాలోని ఆలయాలలో జరిగే అనేక నిత్యకార్యక్రమాల్ని, మరొక జిల్లాలోని ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులు తెలుసుకోవాలని చెప్పారు. అదేవిధంగా 2007 సంవత్సరం జూలై నెలలో ప్రారంభించిన ఈ అర్చక శిక్షణా శిబిరం నేటికి 25 బ్యాచ్‌లను పూర్తి చేయడమైనదని ప్రతి బ్యాచ్‌లోను ఎంతో మంది అర్చకస్వాములు ఈ శిక్షణకు సంబందించి తమ సంతృప్తిని వ్యక్తం చేశారని, రాబోయేరోజుల్లో సైతం పూజావిధానంపై ఇక్కడ ఇస్తున్న శిక్షణను చక్కగా ఉపయోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి దాదాపు 40 మంది అర్చకస్వాములు, శ్వేతడైరెక్టర్‌ శ్రీభూమన్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.