TTD EO RELEASES POSTERS FOR FIRST BTU OF JUBILEE HILS TEMPLE _ జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఈవో

Tirupati, 5 Mar. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Friday evening released the posters of the maiden annual Brahmotsavam of Sri Venkateswara temple at Jubilee Hills in Hyderabad slated to begin on March 11and conclude on March 21.

Speaking after the event at his chambers in TTD administrative building, the TTD EO said all arrangements were completed for the conduct of the first annual Brahmotsavam at Jubilee Hills temple.

The schedule of Brahmotsavam programs includes Dwajarohanam on March 12, Garuda vahana 16, Rathotsavam 19, Chakrasnanam 20 and Pushpa Yagam on 21.

He said as part of TTD focus on Santana Hindu Dharma propagation, the SVBC will give a live telecast of all events.

JEO Smt Sada Bhargavi, Hyderabad Srivari temple Advisory council member and special invitee of TTD board Sri Govind Hari, Donor Sri Trinadh Babu, DyEO Sri Ramesh Babu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఈవో
     
తిరుపతి, 05 మార్చి 2021: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల పోస్టర్ ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది.
 
మార్చి 11వ తేదీ నుంచి 21వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ , జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. 12వ తేదీ ధ్వజారోహణం, 16వ తేదీ గరుడోత్సవం, 19న రథోత్సవం,  20న చక్రస్నానం, 21వ తేదీ పుష్ప యాగం నిర్వహిస్తామన్నారు. టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
 
జెఈవో శ్రీమతి సదాభార్గవి, హైదరాబాద్ శ్రీవారి ఆలయ సలహామండలి చైర్మన్, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద హరి, డోనర్ శ్రీ త్రినాథ్ బాబు, డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.