READY 15 PANCHAGAVYA PRODUCTS BY JAN 13- EO TTD _ జ‌న‌వ‌రి 13 నాటికి 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు సిద్ధం చేయాలి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati,17 December 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed officials concerned to ensure that at least 15 Panchagavya products are made available to devotees by January 13, ahead of Vaikunta Ekadasi.

Inspecting the pace of production of Panchagavya products at the DPW stores on Friday evening, the TTD EO directed officials to ensure quality products. He inspected the machines making dhoop cones, dhoop sticks, cow dung balls etc.

Thereafter along with Engineering and Estate officials, he also inspected the piece of land being chosen to construct Spiritual Theme Park near the Alipiri – Zoo Park road.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Chief Engineer Sri Nageswar Rao, SE Electrical Sri Venkateswarlu, SV Goshala Director Dr Harnath Reddy, SV Ayurveda College Principal Dr Muralikrishna, Additional Health Officier Dr Sunil and representatives of Ashirwad organisation were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జ‌న‌వ‌రి 13 నాటికి 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు సిద్ధం చేయాలి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 డిసెంబరు 17: జ‌న‌వ‌రి 13వ తేదీ నాటికి 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌ను సిద్ధం చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో గ‌ల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రాన్ని శుక్ర‌వారం ఈవో ప‌రిశీలించారు.

ఇప్ప‌టివ‌ర‌కు సిద్ధ‌మైన ధూప్ కోన్స్‌, ధూప్ స్టిక్స్‌, ధూప్ పౌడ‌ర్, పంచ‌గ‌వ్య మ‌రియు హెర్బ‌ల్ అగ‌ర‌బ‌త్తీలు, పిడ‌క‌లు త‌దిత‌ర యంత్రాల‌ను ఈవో ప‌రిశీలించారు. పంచ‌గ‌వ్యాల‌తో అత్యంత నాణ్య‌మైన ఉత్ప‌త్తులు త‌యారు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

అనంత‌రం అలిపిరి జూపార్కు రోడ్డులో స్పిరిచువ‌ల్ సిటి ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూమిని ఇంజినీరింగ్‌, ఎస్టేట్ అధికారుల‌తో క‌లిసి ఈవో ప‌రిశీలించారు.

ఈవో వెంట టిటిడి జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌, అద‌న‌పు అరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, ఆశీర్వాద్ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.