జ‌న‌వ‌రి 14న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గోదా క‌ల్యాణం

జ‌న‌వ‌రి 14న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గోదా క‌ల్యాణం

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 12: ధ‌నుర్మాస ఉత్స‌వాల్లో భాగంగా తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో మొద‌టిసారిగా జ‌న‌వ‌రి 14వ తేదీన గురువారం గోదా క‌ల్యాణం జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌న్ క‌లిసి ఈ క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. టిటిడి ఉద్యోగుల‌తో పాటు భ‌క్తులంద‌రూ ఈ క‌ల్యాణాన్ని ద‌ర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

జ‌న‌వ‌రి 13న అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ గోదా క‌ల్యాణం

పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మం ముగింపు సంద‌ర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం శ్రీ గోదా క‌ల్యాణం జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నం, ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నృత్య‌రూప‌కం, ఉద‌యం 9.30 గంట‌ల‌కు శ్రీ గోదా క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.