CHAIRMAN, EO EXTENDS SANKRANTI WISHES _ ఈ సంక్రాంతి ఆనందం నింపాలి – ప్రజలకు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

Tirumala, 12 Jan. 21: On the auspicious occasion of Sankranti festival, TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy extended wishes to all the devotees of twin Telugu states on Tuesday.

They also aspired the Corona Covid virus burn to ashes in the holy flames of Bhogi fire. They wished that this Sankranti bring health, wealth and prosperity in the life of every household and let the farmers be blessed with good harvests. With blessings of Gomata they also wished that diary farm develop to many folds on the celestial occasion Kanuma fest.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఈ సంక్రాంతి ఆనందం నింపాలి
– ప్రజలకు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల 12 జనవరి 2021: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ సంక్రాంతి ప్రజలందరి ఇళ్ళలో ఆనందం నింపాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగురాష్ట్రాల ప్రజలకు మంగళవారం వారు ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులందరి ఇళ్ళు పాడి పంటలతో నిండాలని కోరారు. ప్రపంచాన్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేసిన కరోనా మహమ్మారి భోగి మంటల్లో నశించి ప్రజలంతా ఆరోగ్య, ఐశ్వర్యాలతో జీవించాలని ఛైర్మన్, ఈవో కోరారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది