NATIONAL LEVEL BHAGAVAT GITA COMPETITION ON JAN 28 & 29 _ జ‌న‌వ‌రి 28న జాతీయ స్థాయి భ‌గ‌వ‌ద్గీత పోటీలు

Tirupati, 27 Jan. 21: The HDPP is organising National level Bhagavat Gita Competition at Mahati Auditorium in Tirupati on January 28 and 29.

The winners of the Bhagavadgita contest held for students of Class VI to VIII from AP, Telangana Tamilnadu Karnataka and Kerala on the occasion of Gita Jayanthi on December 25 last, will compete on January 28 for the final title. 

The competition will be held between 11 a.m. and 1 p.m.

Subsequently the winners will be given prizes on January 29 at 12 noon.

TTD appealed to all participants to observe COVID-19 guidelines during the competition.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 28న జాతీయ స్థాయి భ‌గ‌వ‌ద్గీత పోటీలు

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 27: టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో జ‌న‌వ‌రి 28, 29వ తేదీల‌లో విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.
 
గ‌త నెల‌లో ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క, కేర‌ళ‌ రాష్ట్రాల్లోని 6 నుండి 9 వ తరగతి వ‌ర‌కు గ‌ల‌ విద్యార్ధినీ విద్యార్థులకు శ్రీమద్భగవద్గీతపై పోటీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌థ‌మ బ‌హుమ‌తులు పొందిన విద్యార్ధినీ విద్యార్థులకు జ‌న‌వ‌రి 28వ తేదీ గురువారం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 29న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.

కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూనే విద్యార్థినీ విద్యార్థులు పోటీల‌లో పాల్గొన‌వ‌ల‌సి ఉంటుంది.
            
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.