CHAIRMAN PARTICIPATES IN SECOND ANNIVERSARY OF SV TEMPLE AT KANYAKUMARI _ కన్యాకుమారిలో ఇక పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు – వివేకానంద ట్రస్ట్ భూమి ఇస్తే కళ్యాణ మండపం నిర్మిస్తాం

Tirumala, 27 Jan. 21: TTD Chairman Sri YV Subba Reddy said that TTD is keen to take up massive dharmic programs at Kanyakumari in Tamilnadu in collaboration with Vivekananda trust.

Participating in the second anniversary of the Srivari temple at Kanyakumari, the Chairman said TTD would construct a Kalyana Mandapam at Kanyakumari if the Vivekanda Trust donates land.

Earlier the Chairman couple participated in religious programs like Punyahavachanam etc. at the temple.

He said dharmic programs at Kanyakumari have slackened due to Covid guidelines but will be resumed after normalcy.

He said the TTD board and Agama pundits will take a decision on the request of devotees for consecrating a Garudalwar statue in the SV temple premises at Kanyakumari.

He also assured construction of an approach road to SV temple at Kanyakumari soon.

TTD board members Sri Sekhar Reddy, Dr Nischita and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కన్యాకుమారిలో ఇక పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు
– వివేకానంద ట్రస్ట్ భూమి ఇస్తే కళ్యాణ మండపం నిర్మిస్తాం

— శ్రీవారి ఆలయ రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 27 జనవరి 2021: తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకా నంద ట్రస్ట్ సహకారంతో ఇక మీదట పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

శ్రీ వైవి దంపతులు బుధవారం కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడిందన్నారు. వివేకానంద ట్రస్ట్ టీటీడీకి చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంత సంఖ్య పెంచుతామని చైర్మన్ తెలిపారు. ఆలయానికి రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, డాక్టర్ నిశ్చిత అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది