SUPPLY ONLY QUALITY COMMODITIES TO TTD- EO TO SUPPLIERS _ టిటిడికి అత్యంత నాణ్య‌మైన వ‌స్తువులు స‌ర‌ఫ‌రా చేయాలి : ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 02 July 2022: TTD EO Sri AV Dharma Reddy has sought all the suppliers that since TTD has been serving Annaprasadams to multitude of devotees everyday, they should provide only quality commodities to the institution.

 

Addressing a meeting of all suppliers at SVETA Bhavan in Tirupati on Saturday, the EO said Laddus and Anna Prasadam are being consumed by lakhs of devotees visiting Tirumala. Therefore the materials supplied by the traders should be of high quality.

 

He said since the cost of materials are met through the contributions of devotees, the suppliers should ensure quality and conduct justified trade practices.

 

Among others he asked the shop owners and eateries to use bio-degradable plates and cups.

 

Interacting with suppliers of rice, ghee, sugar, dals, almonds, cashews jaggery, edible oils, coconuts, camphor, sanitary products, sarees, dhotis etc. he enquired about production, supply systems. He asked them that the Puja materials are believed to be highly sacred and sentimental by devotees and hence there should be no compromise on its quality while supplying to traders, he affirmed.

 

TTD JEO Sri Veerabrahmam, Marketing GM (Procurement) Sri Subramaniam, DyEO Sri Nateshbabu, SVETA Director Smt Prashanti, suppliers to TTD from several regions were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడికి అత్యంత నాణ్య‌మైన వ‌స్తువులు స‌ర‌ఫ‌రా చేయాలి : ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

శ్వేత భ‌వనంలో స‌ర‌ఫ‌రాదారుల‌తో స‌మావేశం

  జులై 02, తిరుపతి, 2022: స‌ర‌ఫ‌రాదారులు అత్యంత నాణ్య‌మైన వంట‌స‌రుకులు, ఇత‌ర వ‌స్తువుల‌ను టిటిడికి స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో శ‌నివారం స‌ర‌ఫ‌రాదారుల‌తో ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు విచ్చేస్తున్నార‌ని, వీరి సౌక‌ర్యార్థం ల‌డ్డూ ప్ర‌సాదం, అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే స‌రుకులు, పూజాసామ‌గ్రి త‌దిత‌ర అన్ని వ‌స్తువులు నాణ్యంగా ఉండాల‌న్నారు. భ‌క్తులు అందించిన కానుక‌ల‌తో స‌ర‌ఫ‌రాదారుల‌కు సొమ్ము చెల్లింపు జ‌రుగుతుంద‌ని, కావున స‌ర‌ఫ‌రాదారులు నిజాయితీగా, న్యాయ‌బ‌ద్ధంగా వ్యాపారం చేయాల‌ని కోరారు. తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకుని బ‌యోడిగ్రేడ‌బుల్ ప్లేట్లు, క‌ప్పులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా బియ్యం, నెయ్యి, చ‌క్కెర‌, పప్పులు, బాదం, జీడిప‌ప్పు, బెల్లం, నూనె, కొబ్బ‌రికాయ‌లు, క‌ర్పూరం, శానిట‌రీ ఉత్ప‌త్తులు, చీర‌లు, పంచ‌లు, పేప‌ర్ ప్లేట్లు త‌దిత‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రాదారుల‌తో ఈవో నేరుగా మాట్లాడి సేక‌ర‌ణ‌, త‌యారీ విధానం, బిల్లుల చెల్లింపు త‌ద‌త‌ర విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, మార్కెటింగ్ జిఎం(కొనుగోలు) శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యం, డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్‌బాబు, శ్వేత సంచాల‌కులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన స‌ర‌ఫ‌రాదారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.