TRAINING FOR TTD ANNAPRASADAM OFFICIALS AND STAFF _ టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం అధికారులు, సిబ్బందికి శిక్ష‌ణ‌

Tirupati, 18 Feb. 22: The officials and staff of the TTD Anna Prasadam department are being given a 10-day long crash coaching in catering by the AP Tourism Corporation.

 

The training program is aimed at providing quality and delicious Anna Prasadam items to devotees coming for Srivari Darshan. They included a focus on the latest methods, precautions and procurement and safe keeping of basic raw materials, reducing wastage and decorum of dealing with devotees.

 

Those who underwent were assistant catering officers, catering supervisors, servers, head cooks, cleaners and cooks.

 

Anna Prasadam DyEO Sri Harindranath, Catering OSD Sri GLN Shastri, SVETA Director Smt Prashanti, AP tourism DVM Sri Giridhar Reddy, Tourism training institute Principal Sri V Giribabu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం అధికారులు, సిబ్బందికి శిక్ష‌ణ‌

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 18: టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం అధికారులు, సిబ్బందికి శుక్ర‌వారం తిరుప‌తిలోని ఎపి టూరిజం కార్పొరేష‌న్‌కు చెందిన శిక్ష‌ణ సంస్థ‌లో క్యాట‌రింగ్ మెళ‌కువ‌ల‌పై శిక్ష‌ణ ఇచ్చారు. 10 రోజుల పాటు ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు నాణ్య‌మైన, రుచిక‌ర‌మైన అన్నప్ర‌సాదాలు త‌యారు చేసి అందించేందుకు ఈ శిక్ష‌ణ ఏర్పాటుచేశారు. క్యాట‌రింగ్‌లో అవ‌లంబించాల్సిన ఆధునిక ప‌ద్ధ‌తులు, జాగ్ర‌త్త‌లు, ముడిస‌రుకులను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం, వాటి వినియోగం, భ‌క్తుల‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు, అన్న‌ప్ర‌సాదాల వృథాను అరిక‌ట్ట‌డం త‌దిత‌ర అంశాల‌పైన శిక్ష‌ణ ఇచ్చారు. అసిస్టెంట్ క్యాట‌రింగ్ ఆఫీస‌ర్‌, క్యాట‌రింగ్ సూప‌ర్‌వైజ‌ర్లు, స‌ర్వ‌ర్లు, హెడ్‌కుక్‌లు, క్లీన‌ర్లు, కుక్‌లను ఈ శిక్ష‌ణ ఇస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ప్ర‌త్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, శ్వేత సంచాల‌కులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, ఎపి టూరిజం డివిఎం శ్రీ గిరిధ‌ర్‌రెడ్డి, శిక్ష‌ణ సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ వి.గిరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.