TTD CHAIRMAN INSPECTS HOTELS AND OLD ANNAPRASADAM COMPLEX AT TIRUMALA _ పాత అన్నదానం కాంప్లెక్స్, హోటల్స్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala,18 February 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday morning inspected the old Annaprasadam Complex and eateries around it and also enquired about the luggage counter maintained at the complex.

 

Interacting with officials he enquired about food serving, entry and exit of devotees after food at the complex.

 

Later inspecting the eateries at the Raavi maanu circle he also enquired about devotees accommodation, Sarva darshan etc.

 

Thereafter Sri Subba Reddy couple also visited Dharmagiri Veda Pathashala and interacted with Principal Sri Kuppa Siva Subramanya Avadhani who recently underwent surgery. Earlier they also visited the Sri Bedi Anjaneya Swamy temple and had Darshan.

 

NO SALE OF FOOD AT TIRUMALA: TTD CHAIRMAN

 

TTD Chairman said as per the recent decision of the TTD board henceforth TTD will ban the sale of food items on Tirumala shrine and that it will make elaborate arrangements of giving free Annaprasadam to all devotees,

 

He said his visit to old Annaprasadam complex is to make all arrangements for the new task and will discuss with officials in that direction.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పాత అన్నదానం కాంప్లెక్స్, హోటల్స్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 18 ఫిబ్రవరి 2022: తిరుమల లోని రావి చెట్టు సెంటర్లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్, చుట్టుపక్కల ఉన్న హోటళ్ళను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు.

పాత అన్నదానం కాంప్లెక్స్ లోని లగేజీ కౌంటర్ నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ భవనంలో అన్న ప్రసాదం ఎలా వడ్డించే వారని, భక్తులను ఏ మార్గంలో లోనికి అనుమతించి ఏ మార్గంలో బయటకు పంపేవారనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావి మాను సర్కిల్ లోని హోటళ్ళను పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో వసతి, సర్వదర్శనం ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకున్నారు.

ఆ తరువాత చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ధర్మగిరి వేద పాఠశాలకువెళ్ళి ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధానిని పరామర్శించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శివ సుబ్రమణ్య అవధాని ఆరోగ్య పరిస్థితి గురించి వారు తెలుసుకున్నారు. అంతకు ముందు చైర్మన్ దంపతులు శ్రీ బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.

తిరుమలలో ఆహారం విక్రయించరాదు : టీటీడీ చైర్మన్

తిరుమలలో ఎక్కడా ఆహారం విక్రయించకుండా, టీటీడీనే భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు గురువారం బోర్డ్ మీటింగ్ లో తీర్మానం చేశామని అన్నారు. ఈ ఏర్పాట్ల కోసమే పాత అన్నదానం కాంప్లెక్స్ ను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అధికారులతో చర్చించి ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని కరోనా సమయంలో లోక కళ్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికగా అనేక పారాయణాలు, ప్రవచనాలు చేశారని ఆయన తెలిపారు. అనారోగ్యానికి గురైన ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది