JAGANANNA VIDYA KANUKA SCHEME FOR TTD SCHOOLS- TTD JEO (MEDICAL & EDUCATION) _ టిటిడి అన్ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల‌కు విద్యాకానుక : జ‌గ‌న‌న్న విద్యాకానుక ప్రారంభ స‌భ‌లో జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి భార్గ‌వి

Tirupati, 8 Oct. 20: TTD JEO (Medical and Education) Smt Sada Bhargavi on Thursday said seven aided TTD schools will benefit from Jagananna’s Vidya Kanuka Scheme with immediate effect.

She was speaking at Sri Govindaraja Swami High School where she launched the prestigious AP Government’s educational program and also distributed kits to students and their parents.

The JEO said will ensure measures that 1600 students of the remaining three unaided schools run by the TTD will also get this benefit from the scheme under the SV Vidyadana Trust.

She said the unique scheme of AP Government would go a long way in achieving 100 % results and also stalling the drops out from the schools, she maintained.

Contending that it was a memorable day in the 40 years of education history of TTD schools the JEO said the program was an extension of the set goals of the TTD in the realm of education for parents of poor students.

She said the Honourable Chief Minister Sri YS Jaganmohan Reddy has understood the difficulties of poor parents in spending on uniforms and other educational materials for their wards and promoted the scheme to set high standards in education.

The JEO said Vidyadanam is one of the most sacred and pious among all charities mentioned in Hindu Dharma and appealed to all students of TTD educational institutions to achieve high positions.

She further urged all students and their parents to make good use of the facilities and sops provided by the State Government and by TTD. She directed the TTD officials to make note of the suggestions made by the parent committees to provide all necessary facilities in the schools. 

Earlier DEO of thr TTD Dr R Ramana Prasad, Principal Sri Krishnamurthy and parents committee Chair Person Smt Saraswati also spoke on the occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పాఠశాలల్లో జ‌గ‌న‌న్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి భార్గ‌వి

తిరుప‌తి, 2020 అక్టోబ‌రు 08: టిటిడి ప‌రిధిలోని 7 ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న విద్యాకానుక అమ‌ల‌వుతోంద‌ని, మిగిలిన 3 అన్ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల‌కు చెందిన 1600 మంది విద్యార్థుల‌కు కూడా ఎస్వీ విద్యాదాన ట్ర‌స్టు ద్వారా ఈ కానుక ఇప్పించేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి తెలిపారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో వంద శాతం ఫ‌లితాలు సాధించ‌డంతోపాటు డ్రాపౌట్స్‌(మ‌ధ్య‌లో బ‌డి మానేయ‌డం) లేకుండా చేయ‌డానికి జ‌గ‌న‌న్న విద్యాకానుక ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. గురువారం తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌గ‌న‌న్న విద్యాకానుక ప‌థ‌కాన్ని జెఈవో ప్రారంభించి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు విద్యాకానుక కిట్ల‌ను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ పేద విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఇది గుర్తుండిపోయే రోజు అని చెప్పారు. విద్యారంగంలో టిటిడి గ‌త 40 సంవ‌త్స‌రాలుగా చేస్తున్న ఆశ‌యాన్ని సాధించ‌డానికి ఈ ప‌థ‌కం కూడా ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. చాలామంది పేద విద్యార్థులు యూనిఫామ్, ఇత‌ర అవ‌స‌రాల‌కు త‌గిన ఆర్థిక స్థోమ‌త లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని, ముఖ్య‌మంత్రి ఈ విష‌యాన్ని గుర్తించి ప్ర‌తి ఒక్క‌రికీ ఉన్న‌త ప్ర‌మాణాల‌తో నాణ్య‌మైన చ‌దువు అందించాల‌నే ఉద్దేశంతో ఈ ప‌థకాన్ని ప్రారంభించార‌ని చెప్పారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్ప‌ద‌ని, ఇది మ‌నిషి బ‌తికినంత కాలం అన్ని అవ‌స‌రాలు తీర్చుతుంద‌ని అన్నారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులు ఉన్న‌త‌స్థానాల‌కు వెళ్లి ప‌ది మందికి విద్యాదానం చేయాల‌ని ఆమె కోరారు.

ప్ర‌స్తుతం ఉన్న మంచి వాతావ‌ర‌ణాన్ని స‌ద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చ‌దువుకోవాల‌ని, ఉపాధ్యాయులు మంచి ఫ‌లితాలు సాధించేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పాఠ‌శాల‌లు న‌డిపించాల‌ని జెఈఓ సూచించారు. పాఠ‌శాల త‌ల్లిదండ్రుల క‌మిటీలు చేసిన సిఫార‌సుల‌ను కూడా దృష్టిలో ఉంచుకుని పాఠ‌శాల‌ల్లో అన్ని స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి అధికారులు కృషి చేయాల‌ని ఆదేశించారు. విద్యార్థులు బ‌ట్టీ ప‌ట్టే చ‌దువులు కాకుండా పాఠ్య పుస్త‌కాల‌ను బాగా చ‌దివి విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని చెప్పారు.

అంత‌కుముందు దేవ‌స్థానం విద్యాశాఖాధికారి డా. ఆర్‌.ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు శ్రీ కృష్ణ‌మూర్తి, త‌ల్లిదండ్రుల క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి ప్ర‌సంగించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.