CONVENIENT VAIKUNTA EKADASI DARSHAN TO COMMON DEVOTEES IN TTD TEMPLES- JEO VEERABRAHMAM _ టిటిడి ఆలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వైకుంఠ ఏకాదశి దర్శనం – అధికారులకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

 * JEO DIRECTS OFFICIALS TO MAKE ALL ARRANGEMENTS

Tirupati,12 December 2022 TTD JEO Sri Veerabrahmam on Monday directed officials to make all arrangements at TTD temples in Bangalore, Chennai, Hyderabad, Delhi and Mumbai to provide comfortable Vaikunta Ekadasi Darshan to devotees.

Addressing a virtual video Conference with DyEOs of all temples on Monday on the ensuing Vaikunta Ekadasi preparations, the TTD JEO directed that queue lines of common devotees should not be stopped to make way for VVIPs 

He said large number of devotees were expected to visit temples of Srinivasa Mangapuram, Appalayagunta temples on the auspicious days as at Chennai, Bangalore, Visakhapatnam, Amaravati temples.

He said special queue lines and darshan hours be maintained for VVIPs so that common devotees are not put for any inconvenience.

He said an action plan be prepared in consultation with local advisory committees, local officials and police. Preparations be made to ensure that every devotee get Prasadam.

The JEO instructed the engineering officials to make arrangements for queue lines, drinking water etc.at each temple and TTD information centre.

The DyEO(services)has been authorised to deploy additional staff on the holy day.

Among others TTD vigilance officials to coordinate with local police for making parking, deploy adequate Srivari Sevakulu, electrical and floral decorations.

Darshan hours to be decided at Delhi, Rishikesh and Kurukshetra temples depending on local weather conditions.

He asked officials to make arrangements for the Maha Samprokshana fete at Sitampeta, Rampachodavaram, Chennai and Jammu where new temples construction was completed.

The JEO said a monitoring cell for Vaikunta Ekadasi arrangements was set up in Tirupati to supervise arrangements on a war footing. He also directed that development works at Vakulamata temple including toilets be completed on a war footing.

TTD SEs Sri Satyanarayana, Sri Venkateshwarlu, VGO Sri Manohar, all temple DyEOs and other engineering staff were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వైకుంఠ ఏకాదశి దర్శనం – అధికారులకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశం

తిరుపతి, 2022 డిసెంబ‌రు 12: టిటిడి స్థానిక ఆలయాలు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి మెట్రో నగరాల్లోని శ్రీవారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. విఐపిల రాక సందర్భంగా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలపకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సోమవారం జెఈవో వివిధ ఆలయాల డెప్యూటీ ఈవోలు ఇతర అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట ఆలయాలకు వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందన్నారు. అలాగే చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, అమరావతి ఆలయాలకు కూడా భక్తులు భారీగా వస్తారని చెప్పారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, విఐపిలకు నిర్దేశిత సమయం కేటాయించి దర్శనం కల్పించడం ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. స్థానిక సలహా మండళ్లతో చర్చించి, స్థానిక అధికారులు, పోలీసుల సహకారంతో వైకుంఠ ఏకాదశి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి భక్తుడికీ ప్రసాదం అందేలా దిట్టం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు తమ పరిధిలోని ఆలయాలు, సమాచార కేంద్రాల్లో తాగునీరు, క్యూలైన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన డెప్యుటేషన్ సిబ్బందిని నియమించాలని డెప్యూటీ ఈఓ(సర్వీసెస్)ను ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో చర్చించి అవసరమైన చోట పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణకు అవసరమైనంత మంది శ్రీవారి సేవకులు, విజిలెన్స్‌ సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆలయాల్లో శోభాయమానంగా విద్యుత్‌దీపాలు, పుష్పాలతో అలంకరణ చేపట్టాలన్నారు. ఢిల్లీ, రిషికేష్‌, కురుక్షేత్ర ఆలయాల్లో స్థానిక వాతావరణాన్ని బట్టి దర్శన సమయాలు నిర్ణయించుకోవాలన్నారు.

సీతంపేట, రంపచోడవరం, చెన్నై, జమ్మూ ఆలయాల నిర్మాణం త్వరగా పూర్తిచేసి మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పర్యవేక్షణకు తిరుపతిలో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వకుళమాత ఆలయం వద్ద మరుగుదొడ్లు ఇతర అభివృద్ధిపనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎస్‌ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ మనోహర్‌తోపాటు ఆలయాల డెప్యూటీ ఈవోలు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.