TTD KALYANA MANDAPAMS TO BE CENTRES OF DHARMA _ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు కేంద్రంగా ధ‌ర్మ‌ప్ర‌చారం : జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 7 Mar. 20: TTD Joint Executive Officer Sri P Basant Kumar today directed that all TTD Kalyana Mandapams should act centres as of Sanatana dharma propagation in future.

He was addressing a meeting of HDPP coordinators, program assistants of all Kalyana Mandapams and TTD Information centres at the auditorium of TTD administrative building on Saturday morning.

Speaking on the occassion the JEO said all local bhajan mandals, Srivari Sevakulu should take up dharmic programs at the Kalyan mandapams regularly.

He said all administrative hurdles in HDPP like payments etc. would be on the centralised system of TTD only and action plans be devised in HDPP in the same pattern.

TTD FA and CAO Sri O Balaji, Additional FA and CAO Sri Ravi Prasad, HDPP Secretary Acharya Rajagopalan, Dharmic studies OSD Dr EG Hemantkumar, AEO s and superintendents and program assistants of all district units of TTD participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు కేంద్రంగా ధ‌ర్మ‌ప్ర‌చారం : జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2020 మార్చి 07: ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లేందుకు టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు కేంద్రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ సూచించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ఇత‌ర ప్రాంతాల్లోని క‌ల్యాణ‌మండ‌పాలు, స‌మాచార కేంద్రాల‌కు సంబంధించిన హెచ్‌డిపిపి కో-ఆర్డినేట‌ర్లు, ప్రోగ్రాం అసిస్టెంట్ల‌తో శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న భ‌జ‌న‌మండ‌ళ్లు, శ్రీ‌వారి సేవ‌కుల‌ను క‌లుపుకుని ప్ర‌తి క‌ల్యాణ‌మండ‌పంలో మ‌రిన్ని ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌న్నారు. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ అనంత‌రం చెల్లింపుల్లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కార మార్గాల‌ను సూచించారు. టిటిడిలో అమ‌ల‌వుతున్న విధంగానే హెచ్‌డిపిపిలోనూ కేంద్రీకృత విధానం ద్వారా చెల్లింపులు జ‌రిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎఫ్ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, అద‌న‌పు ఎఫ్ఏ, సిఏవో శ్రీ ర‌విప్ర‌సాదు, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ధార్మిక ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకాధికారి డా. ఇ.జి.హేమంత్‌కుమార్‌, ఆయా జిల్లాల‌కు చెందిన ఏఈవోలు, సూప‌రింటెండెంట్లు, ప్రోగ్రామ్ అసిస్టెంట్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.