ID FESTIVITIES CUM DOG/ HORSE SHOW AND CULTURAL PROGRAMS BY TTD VIGILANCE STAFF _ టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలు

Tirupati, 15 Aug. 21:As part of Independence Day celebrations the TTD vigilance wing put up a spectacular display of parade, Dog show cum horse show by NCC cadets and cultural programs at the parade grounds on Sunday morning.

 

Earlier the TTD EO Dr KS Jawahar Reddy unfurled the national flag and declared the festivities open.

 

The parade by vigilance staff led by the AVSO Sri K Venkatarama as parade commander was attractive.

 

Thereafter the TTD EO presented certificates to 274 employees including 22 officials of several departments for their meritorious performance during the year.

 

He also separately felicitated six others from the medical wing and 14 from the canteen wing for their stellar service during COVID season at hospitals and quarantines. 

 

The SV music and dance college students presented a song ballad on the independence theme. 

 

This was followed by a Horse show presented by NCC cadets of SV Arts college which included demos by Gagan, Rani Jhansi, Good luck, Natwar and Mahal and other attractive displays.

 

Later the display by Viratb, Simba, Tara, Tiger, Pruthvians Shiny dogs which included handing bouquet and saluting the EO, group drill, narcotic and explosive tracking, bike jump and fire jump stunts.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో పంద్రాగస్టు వేడుకలు

ఆక‌ట్టుకున్న అశ్వ‌, జాగిలాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుప‌తి, 2021 ఆగస్టు 15: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ కె.వెంక‌ట‌ర‌మ‌ణ‌ పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 22 మంది అధికారులు, 274 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా, కోవిడ్ స‌మ‌యంలో ఉత్త‌మ సేవ‌లు అందించిన వైద్య విభాగంలోని ఆరుగురు ఉద్యోగుల‌కు, టిటిడి క్యాంటీన్ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న 14 మంది సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అందించారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ఎగుర‌వే మువ్వ‌న్నెల జెండా…, న‌మో హిందు మాత‌…., భ‌వ‌తు భార‌తం…. గీతాల‌కు ప్ర‌ద‌ర్శించిన సంప్రదాయ నృత్యం ఆక‌ట్టుకుంది.

ఆ త‌రువాత ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల ఎన్‌సిసి విద్యార్థుల అశ్వ ప్ర‌ద‌ర్శ‌న ఆద్యంతం అల‌రించింది. ఇందులో గుడ్‌ల‌క్‌, మాపెల్‌, గగన్‌, నట్వర్‌, రాణీ ఝాన్సీ అనే పేర్లు గల అశ్వాలతో విన్యాసాలు చేశారు. ఎన్‌సిసి క్యాడెట్లు మొదటగా జాతీయ జెండా, ఎన్‌సిసి జెండా, టిటిడి జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా, స్టాండిగ్ సెల్యూట్, టెంట్‌ పెగ్గింగ్‌, షో జంపింగ్‌ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్‌ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి.
 
అనంత‌రం జాగిలాల ప్ర‌ద‌ర్శ‌న చ‌క్క‌గా జ‌రిగింది. ఇందులో విరాట్‌, షైనీ, సింబ‌, తార‌, టైగ‌ర్‌, పృథ్వీ  త‌దిత‌ర జాగిలాలు ఈవోకు బొకే అందించ‌డం, వంద‌నం చేయ‌డం, గ్రూప్‌డ్రిల్‌, నార్కోటిక్‌, పేలుడు ప‌దార్థాల గుర్తింపు, బైక్ జంప్‌, ఫైర్ జంప్, దుండుగుల‌తో పోరాటం త‌దిత‌ర విన్యాసాల‌ను ప్రద‌ర్శించాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.