Rs.9.20 CRORE DONATION IN ASSEST AND CASH TO TTD _ టీటీడీ కి రూ. 9 కోట్ల 20 లక్షలు విరాళం

PROPERTY DOCUMENTS HANDED OVER TO TTD CHAIRMAN

 

Tirumala, 17, Feb 2022: A donor from Chennai donated Rs.3.2 crore cash and properties worth Rs.6 crores to TTD on Thursday morning.

 

Smt Revati Vishwanatham from Chennai (Karappakam) has donated the of cash of Rs. 3.20crores towards the construction of Paediatric Super Speciality Hospital mulled by TTD through SV Pranadana Trust and also two houses belonging to her late sister Dr Parvatam (76) worth about Rs. 6crores as per her will.

 

She along with her husband Sri PA Viswanathan and Sri V Krishnan (will executor) has handed over the documents of the will to TTD Chairman Sri YV Subba Reddy at the Ranganayakula mandapam in Tirumala temple on Thursday.

 

Later they said Dr Parvatam who remained spinster all her life has donated her entire property to Sri Venkateswara Swamy. Earlier also she has donated to SV Pranadana Trust and Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) of TTD on different occasions.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టీటీడీ కి రూ. 9 కోట్ల 20 లక్షలు విరాళం
– ఇందులో రూ 3 కోట్ల 20 లక్షలు చిన్నపిల్లల ఆసుపత్రికి
– రూ 6 కోట్ల ఆస్తి స్వామివారికి
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి పత్రాలు అందించిన దాత సోదరి

తిరుమల 17 ఫిబ్రవరి 2022: టీటీడీ కి గురువారం రూ 9 కోట్ల 20 లక్షల విరాళం అందింది. ఇందుకు సంబంధించిన పత్రాలను దాత స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.

చెన్నె మైలాపూర్ కు చెందిన స్వర్గీయ డాక్టర్ పర్వతం పేరు మీద బ్యాంకు లో రూ 3 కోట్ల 20 లక్షల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు రూ 6 కోట్ల విలువైన రెండు ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది