UNION MINISTER LAUDS TTD DHARMIC ACTIVITIES _ టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి – అభినందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Tirumala, 11 Jan. 21: Lauding the efforts of TTD in the propagation of Hindu Sanatana Dharma, Union Minister Sri Prahlad Joshi appreciated TTD Chairman Sri YV Subba Reddy for taking up the Dharmic activities in a big way. 

The TTD Trust Board Chief formally met the Union Minister for Coal, Parliamentary Affairs and Mines of India at New Delhi on Monday. He presented the minister the theertha prasadams and calendar and diary along with a shawl. 

Later the Union Minister learnt about various dharmic programmes taken up by TTD in recent times including the popular – Gudiko Gomata etc. He also said, TTD is willing to take forward the program across the country to protect and promote Desi Cows. 

Union Minister lauded the efforts TTD for taking up Dharmic programmes in a wide manner as part of it’s mission of propagation of Hindu Sanatana Dharma.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి – అభినందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

తిరుమల 11 జనవరి 2021: హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అభినందించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామివారి ప్రసాదం,నూతన సంవత్సరం డైరి, క్యాలెండర్ అందించి మంత్రిని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి చైర్మన్ ను అడిగారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఇటీవల టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత గురించి శ్రీ సుబ్బారెడ్డి మంత్రికి వివరించారు. ఢిల్లీలో కూడా ఇటీవల ఈ కార్యక్రమం ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చైర్మన్ వివరించారు. తమ పాలక మండలి మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తోందని శ్రీ సుబ్బారెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.

హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి శ్రీ సుబ్బారెడ్డిని అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది