డిసెంబరు 16 నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల్లో ధనుర్మాస కార్య‌క్ర‌మాలు

డిసెంబరు 16 నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల్లో ధనుర్మాస కార్య‌క్ర‌మాలు

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 15: టిటిడి అనుబంధ ఆల‌యాల్లో డిసెంబరు 16వ తేదీ బుధ‌వారం నుంచి ధనుర్మాస కార్య‌క్ర‌మాలు  ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయంలో..

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. ఈ సందర్భంగా నెల రోజులపాటు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం సుప్రభాతం బదులు తిరుప్పావై పారాయణం చేస్తారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో..

తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో గల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున సుప్రభాతం బదులు తిరుప్పావై పారాయణం చేస్తారు.

శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరాలయంలో..

శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరాలయంలో డిసెంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉదయం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై నివేదిస్తారు.

దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై నివేదిస్తారు. డిసెంబ‌రు 15 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌రకు అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌ర‌పుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో..

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌ర‌పుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.