TIRUPPAVAI PARAYANAM TO COMMENCE _ డిసెంబరు 16 నుండి 2022 జనవరి 14వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం

TIRUMALA, 14 DECEMBER 2021: With the advent of the holy Dhanurmasam from December 16 onwards, the sacred Tiruppavai Pasura Parayanam will commence in Pedda Jeeyar mutt at Tirumala from Thursday onwards.

Every day there will be each Pasura Parayanam between 8:30am and 9:30am and will conclude on January 14 in 2022.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబరు 16 నుండి 2022 జనవరి 14వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 14: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సంద‌ర్బంగా డిసెంబ‌రు 16 నుండి 2022 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం చేయ‌నున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి మ‌ఠంలో నెల రోజుల పాటు ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు.

విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల ప‌రంప‌ర‌లో వ‌స్తున్న జీయ‌ర్‌స్వాములు తిరుమల శ్రీ‌వారి ఆల‌య కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.