PRIZES DISTRIBUTED ON GITA JAYANTHI _ భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం

Tirupati, 14 DECEMBER 2021: The winners of the Bhagavat Gita shloka recitation competition were awarded on Tuesday evening on the occasion of Gita Jayanthi.

This event was organized at Annamacharya Kalamandiram in Tirupati. This competition was held under the aegis of the HDPP wing of TTD.

At the beginning of the programme scholar’s Sri Maruti, Sri Raghavendra, Sri Ramakrishna Seshasai, Sri Cjakravarti Raghavan addressed the students about the importance of the Bhagavat Gita.

The competition was held on December 5 to students in the 17th Chapter of Bhagavat Gita – Shradhatraya Vibhaga Yogam.

The students were categorised as Junior that includes 6th and 7th class students while students of 8th and 9th standards were categorised as Seniors. Likewise, the competitions were also held in all 700 Shlokas to those above and below 18years of age.

For the winners in all these four categories, All Projects Officer of TTD Sri Vijayasaradhi, HDPP Secretary Sri Rama Rao gave away the prizes.

HDPP AEO Sri Satya Narayana, Co-ordinator Sri Mahesh were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం

 తిరుపతి, 2021 డిసెంబర్ 14: భగవద్గీత కంఠస్థం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గీతాజయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.

డిసెంబర్ 5న తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలతో పాటు గురువాయూరు, బెంగళూరు, చెన్నైలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించారు. భగవద్గీతలో 17వ అధ్యాయమైన శ్రద్దాత్రయ విభాగ యోగంపై 6 మరియు 7 తరగతులు ఒక విభాగంగాను, 8 మరియు 9 తరగతులు మరో విభాగంగాను ఈ పోటీలు జరిగాయి. అలాగే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీత కంఠస్థ విభాగంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారికి వేరువేరుగా పోటీలు జరిగాయి. 

ఈ నాలుగు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి టిటిడి ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారధి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ కెఎస్.రామారావు కలిసి బహుమతులు ప్రదానం చేశారు.

అంతకుముందు తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు శ్రీ పివిఎస్ఎస్‌.మారుతి, ఆగమ పండితులు శ్రీ పి.రాఘవేంద్ర, టిటిడి పురాణ పండితులు శ్రీ రామ‌కృష్ణ శేష‌సాయి, జాతీయ సంస్కృత వర్సిటీ ఆచార్యులు శ్రీ చక్రవర్తి రాఘవన్ గీతా వైశిష్ట్యంపై ఉపన్యసించారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్  ఎఈవో శ్రీ సత్యనారాయణ, కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.