SRINIVASA SETU BY DECEMBER 31-EO _ డిసెంబరు 31నాటికి శ్రీ‌నివాస సేతు నిర్మాణం పూర్తి చేయాలి – అధికారుల‌కు టిటిడి ఈవో ఆదేశం

TIRUPATI, 28 OCTOBER 2022: The pending works related to Srinivasa Setu should be completed by this yead end, said TTD EO Sri AV Dharma Reddy.

Reviewing with TTD, Smart City Corporation officials in his chambers’ on Friday evening, the EO directed the concerned to speed up the fabricated girders to be laid at Ramanuja Circle. Before that complete the roads, drains, footpaths, medians works, he added.

The EO the works needs to taken up on a fast pace at Ramanuja Circle to Mangoes Market, Kalanjali Showroom, RTC Bus Stand, MS Subbu Lakshmi statue to RTC Bus stand.

Inform the police well in advance to avoid traffic issues while taking construction works in RTC bus stand area, he informed the concerned.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Corporation Commissioner Kumari Anupama Anjali, CE Sri Nageswara Rao and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 31నాటికి శ్రీ‌నివాస సేతు నిర్మాణం పూర్తి చేయాలి – అధికారుల‌కు టిటిడి ఈవో ఆదేశం

తిరుప‌తి, 2022 అక్టోబ‌రు 28: శ్రీ‌నివాస సేతు నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌న్నీ ఈ ఏడాది డిసెంబరు 31లోగా పూర్తి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని కార్యాల‌యంలో శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న మున్సిప‌ల్, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్, టిటిడి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. .

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ రామానుజ స‌ర్కిల్‌లో ఏర్పాటు చేయాల్సిన ఫ్యాబ్రికేటెడ్ గ‌డ్డ‌ర్ త్వ‌ర‌గా తెప్పించి ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు. ఈలోపు రోడ్లు, కాలువ‌లు, ఫుట్‌పాత్‌, మీడియ‌న్ల ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. రామానుజ స‌ర్కిల్ నుండి మామిడికాయ‌ల మండీ, క‌ళాంజ‌లి షోరూం, ఆర్‌టిసి బ‌స్టాండు, సుబ్బ‌ల‌క్ష్మి విగ్ర‌హం నుండి ఆర్‌టిసి బ‌స్టాండ్ క‌లిపి ఐదు సెగ్మెంట్ల‌ ప‌నుల్లో వేగం పెంచాల‌ని కోరారు. సుబ్బ‌ల‌క్ష్మి స‌ర్కిల్ నుండి రామానుజ స‌ర్కిల్ వ‌ర‌కు ప‌నులు ప్రారంభించ‌డానికి ముందే పోలీస్ శాఖ‌కు స‌మాచారం అందించి ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు చ‌ర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో మ్యాన్‌ప‌వ‌ర్‌ను పెంచాల‌ని ఈవో సూచించారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ కుమారి అనుప‌మ అంజ‌లి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు శ్రీ మోహ‌న్‌, శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్ జిఎం శ్రీ చంద్ర‌మౌళి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.