ONLINE QUOTA OF RS 300/- TO BE RELEASED ON DECEMBER 30 _ డిసెంబ‌రు 30న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala, 29 Dec. 20: TTD will release the January online quota of Rs.300/- special darshan tickets for the period from January 4 to January 31 on December 30 at 9am.

TTD has already issued online tickets up to January 3, as part of Vaikunta Dwara Darshan from December 25 to January 3. The quota for remaining days in January will be released on Wednesday.

Meanwhile the prominent festivals at Srivari temple in the month of January

* January 7: Adhyayanotsavam concludes

* January 8: Sri Malayappa visit to Sri Tirumala Nambi Sannidhi.

* January 9, 24: Sarva Ekadasi

* January 10: Sri Thondaradiappalwar Varsha Tiru Nakshatram.

* January 13: Bhogi 

* January 14: Makara Sankranthi

* January 15:  Kanuma, Sri Goda Parinayotsavam, Paruveta Utsavam

* January 28: Sri Ramakrishna Theertha Mukkoti

* January 30:Sri Thirumalisai Alwar Varsha Tiru Nakshatram

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబ‌రు 30న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 29: భక్తుల సౌకర్యార్థం జ‌న‌వ‌రి 4 నుండి 31వ తేదీ వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబ‌రు 30న బుధ‌‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు ఇదివ‌ర‌కే ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఈ కార‌ణంగా జ‌న‌వ‌రి 4 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు టిటిడి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌నుంది.

కాగా, జ‌న‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– జ‌న‌వ‌రి 7న అధ్య‌య‌నోత్స‌వాలు స‌మాప్తి.

– జ‌న‌వ‌రి 8న తిరుమల‌నంబి స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వేంచేపు.

– జ‌న‌వ‌రి 9, 24వ తేదీల్లో స‌ర్వ ఏకాద‌శి.

– జ‌న‌వ‌రి 10న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం.

– జ‌న‌వ‌రి 13న భోగి పండుగ‌.

– జ‌న‌వ‌రి 14న మ‌క‌ర సంక్రాంతి.

– జ‌న‌వ‌రి 15న క‌నుమ పండుగ‌, శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్స‌వం.

– జ‌న‌వ‌రి 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి.

– జ‌న‌వ‌రి 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.