JEO INSPECTS PHCs ON FOOTPATHS _ ప్రథమ చికిత్స కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలి – శ్రీవారి మెట్టు, అలిపిరి నడక దారుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు పరిశీలించిన జెఈవో

Tirumala, 29 Dec. 20: TTD Joint Executive Officer Sri P Basanth Kumar on Tuesday directed officials to keep emergency medicines at all the Primary Health Centres on Alipiri and Srivari Mettu footpaths.

Accompanied by the CVSO Sri Gopinath Jatti, JEO inspected the PHCs on both the footpaths and verified on availability of emergency drugs and trauma equipments.

He directed the concerned that doctors should be available at all the PHCs (four on Alipiri and one on Srivari Mettu) routes. He instructed officials to set up two more PHCs on Srivari Mettu route.

Later he directed the engineering officials that they should take up the repair works of the existing PHCs and also ensure availability of Ambulances and wireless communications at all PHCs.

SE-2 Sri Nageswara Rao, Chief Medical Officer, Dr Narmada and Dr Bharat Kumar were present

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ప్రథమ చికిత్స కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలి 
–  శ్రీవారి మెట్టు, అలిపిరి నడక దారుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు పరిశీలించిన జెఈవో
 
తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 29: శ్రీవారి మెట్టు,అలిపిరి నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల్లో అత్యవసర మందులు, సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవాలని జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి తో కలసి మంగళవారం ఆయన శ్రీవారి మెట్టు,అలిపిరి నడక దారుల్లోని ప్రథమ చికిత్స కేంద్రాలను పరిశీలించారు. 
 
తిరుమల నడక దారుల్లో భక్తులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అత్యవసర చికిత్స అవసరమైతే వారి ప్రాణాలు నిలపగలిగి ఆసుపత్రికి చేర్చేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉండాలని జెఈవో చెప్పారు. అలిపిరి మార్గంలోని నాలుగు, శ్రీవారి మెట్టు వద్ద ఉన్న ఒక ప్రథమ చికిత్స కేంద్రాల్లో  డాక్టర్ ను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయాలని ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. అంబులెన్స్, వైర్ లెస్ సెట్లు అందుబాటులో ఉంచే ఆలోచన ఉందన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో మరో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని జెఈవో అధికారులను ఆదేశించారు. ఎస్ఈ 2 శ్రీ నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, డాక్టర్ భరత్ కుమార్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.