డ్రై ఫ్లవర్ టెక్నాలజీ లో వస్తువుల తయారీకి మహిళల పేర్ల నమోదుకు ఆహ్వానం

డ్రై ఫ్లవర్ టెక్నాలజీ లో వస్తువుల తయారీకి మహిళల పేర్ల నమోదుకు ఆహ్వానం

తిరుపతి 26 నవంబరు 20 21: టీటీడీ డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో వస్తువుల తయారీ శిక్షణ కోసం తిరుపతికి చెందిన మహిళలు పేర్లు నమోదు చేసుకోవాలని చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో స్వామి అమ్మవారి చిత్ర పటాలు, కీ చైన్లు, డాలర్లు, పేపర్ వెయిట్లు తయారుచేయడంలో మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శిక్షణ కోసం మహిళలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ శిక్షణ మహిళలకు ఆదాయమార్గంగాను, స్వామివారి సేవ లాగా కూడా ఉపయోగపడుతుందన్నారు. తిరుపతికి చెందిన మహిళలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. చీనీ నిమ్మ పరిశోధన స్థానం లో నిర్వహించే ఈ శిక్షణ కోసం మరిన్ని వివరాలకై 9951450533 నెంబర్లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది