LAKSHA KUMKUMARCHANA AND ANKURARPANA ON NOVEMBER 29 _ న‌వంబ‌రు 29న శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

TIRUPATI, 26 NOVEMBER 2021: Laksha Kumkumarchana and Ankurarpanam in connection with annual Karthika Brahmotsavams in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor will be observed on November 29.

 

In the morning Kumkumarchana will be observed while in the night Beejavapanam will be performed.

 

The Dhwajarohanam for the Navahnika Brahmotsavam will be observed between 9:45am and 10am on November 30 in the auspicious Dhanurlagnam.

 

Due to Covid restrictions, the annual fete is taking place in Ekantam. Everyday, the processional deity of Sri Padmavathi Devi will bless devotees on different vahanams both in the morning and in the evening.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

న‌వంబ‌రు 29న శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

– ఉద‌యం ల‌క్షకుంకుమార్చ‌న‌
– భక్తులు వర్చువల్ గా పాల్గొనే అవకాశం

తిరుపతి, 2021 నవంబరు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 29వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. భక్తులు వర్చువల్ గా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

న‌వంబ‌రు 30న ధ్వ‌జారోహ‌ణం :

ఆలయంలో న‌వంబ‌రు 30న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుండి 10 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారు వాహ‌న‌మండ‌పంలో వివిధ వాహ‌న‌ల‌పై దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ                ఉదయం                     రాత్రి

30-11-2021 ధ్వజారోహణం        చిన్నశేషవాహనం

01-12-2021 పెద్దశేషవాహనం     హంసవాహనం

02-12-2021 ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

03-12-2021 కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం

04-12-2021 పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం, గజవాహనం

05-12-2021 స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం స్వర్ణరథం బ‌దులు సర్వభూపాలవాహనం, రాత్రి -గరుడవాహనం

06-12-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

07-12-2021 రథోత్సవం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నం – అశ్వ వాహనం

08-12-2021 పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో) – ధ్వజావరోహణం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.