SMT VEMIREDDY PRASHANTI REDDY APPOINTED AS CHAIRMAN OF DELHI TTD LAC _ ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

* TO LOOK AFTER TTD TEMPLES IN NORTH INDIA

 

Tirumala, 19 Oct. 21: TTD on Tuesday appointed   Smt Vemireddy Prashanti Reddy as chairman of the TTD Local Area Committee of Delhi with a responsibility to look after affairs of all TTD temples in North India.

 

Her appointment came in the backdrop of TTD chairman Sri YV Subba Reddy request to her take charge of TTD activities in with the goal to spread awareness on propagation and protection of Sanatana Hindu dharma TTD has constructed Sri Venkateshwara temples at Delhi, Kurukshetra and is on avail of promoting SV temples at Jammu and Varanasi as well.

 

Smt V Prashanti Reddy a TTD board member for 2 years and a dedicated devotee of Sri Venkateswara has accepted the coveted appointment and also resigned her second term of TTD board membership with immediate effect.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

ఉత్త‌ర భార‌త‌దేశంలో టిటిడి ఆల‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 19: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా టిటిడి నియ‌మించింది. ఢిల్లీ ఆలయాన్ని అభివృద్ధిప‌రిచేందుకు, భక్తులకు విశేష సేవలందించేందుకు, ఉత్తర భారతదేశంలో టిటిడి ఆలయాల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతిరెడ్డికి పర్యవేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఉత్తర భారతదేశంలోని టిటిడి ఆలయాల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో చేపట్టడానికి టిటిడి బోర్డు చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కోరగా శ్రీ‌మ‌తి ప్రశాంతిరెడ్డి తక్షణమే అంగీకరించారు. ఛైర్మన్ గారి సూచనల మేర‌కు బోర్డు సభ్య‌త్వానికి వారు రాజీనామా సమర్పించారు.

భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం మరియు శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని న‌లుదిశ‌లా వ్యాప్తి చేయాలనే సదుద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో శ్రీవారి ఆలయాల‌ను టిటిడి నిర్మించింది. జమ్మూ, వారణాసి న‌గ‌రాల్లో దేవాలయాల నిర్మాణం కొనసాగుతోంది. గత బోర్డులో రెండు సంవత్సరాలు పనిచేసి ప్రస్తుత బోర్డులో సభ్యురాలిగా కొన‌సాగుతున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వామివారిపై అపారమైన భక్తిశ్రద్ధ‌ల‌తో ఉత్త‌ర భార‌త‌దేశంలో ఆల‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.