తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ద‌ళారిపై కైసు                

తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ద‌ళారిపై కైసు                

తిరుపతి, 2010 ఆగష్టు17: తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తుల అరెస్టు తితిదేలో ఇటీవల ప్రకటించిన ఉద్యోగ ఖాళీల భర్తీకిసంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కోడూరుకు చెందిన శ్రీకాంత్‌, హరిప్రసాద్‌ లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

 16-08-2010 సంవత్సరమున పెద్దూరు గ్రామం ఆముదాల శంకరయ్య తండ్రి ఎ.నరసింహులు 20 సం.లు, వెంకటరాజుపల్లె పోస్టు, చిట్వేలి మండలం, కడప జిల్లా, సెల్‌:9703399746 ఇచ్చిన చీటింగ్‌ రిపోర్టుపైన విచారణ చేపట్టడమైనది. ఈ రిపోర్టును పరిశీలించగా కడప జిల్లా

కోడూరులోని రంగనాయకుల పేటకు చెందిన కుంబకోణం శ్రీకాంత్‌ తండ్రి కె. సుబ్రమణ్యం ఆచారి 19 సం.లు అను అతను ఎం. గురుప్రసాద్‌ అకౌంట్‌ నెం.30649553829 ఎస్‌.బి.ఐ. కోడూరులో డిడి ద్వారా రూ.6500/- మరియు నేరుగా శ్రీకాంత్ చేతికి రు.10000/-లు ఇచ్చినాడు అని సదరు పిటిషనర్ విచారణలో చెప్పాడు. తరువాత రు.10,000/- శ్రీకాంత్‌ ప్రో గ్రాం ఖర్చు అడగగా ఇచ్చినాడు అని తెలిపాడు. సదరు అముదాల శంకరయ్యను విచారిస్తుండగా ఐ.డి. కార్డు తితి దేవస్థానం

తిరుమల పేరు ఎ. శంకరయ్య జిఐఎస్ నెం.54307 హోదా గుర్తింపు కలిగిన కార్డును చూపించారు. సదరు కార్డు దేవస్థానం అధికారులు ఇచ్చినది కాదు. ఇది డూప్లికేటు అని తెలిసింది. మరియు రు.6500/- డిడి కట్టిన బ్యాంకు చలాన జిరాక్స్‌ కాఫీ నెం.1459 ఇవ్వడమైనది. తదుపరి సదరు శంకరయ్యకు ఇచ్చిన అపాయింట్‌మెంటు అర్డర్‌ను చూపించినాడు మరియు దానికి సంబంధించిన తితిదే ఎంప్లాయిస్‌ ఎక్ట్‌ఫర్‌ అండర్‌ తితిదే అనే ఫాంను ఇచ్చినాడు వీటిని పరిశీలించగా మొదటి అప్లికేషన్‌లో రు.18,000/- ఖర్చులు చూపించాడు.

రెండవ వాటిలో డిపాజిట్‌ పేమెంటు రు.20,000/- చూపించినాడు వీటిని కక్షుణ్ణంగా పరిశీలించగా తితిదేకి సంబంధించినవి కావు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంతకం చేసినవి కావు అని తేలినది. ఇంటర్‌నెట్‌లో తీసిన వ్యాప్‌ నెంబర్లు ఎం.హరిప్రసాద్‌, తితిదే 23890065డి 2121 అర్గనైజేషన్‌
గవర్నమెంటు ఆఫ్‌ ఎ.పి అండర్‌ రూల్‌ తితిదే ఎంప్లాయి యాక్ట్‌ నందు 7 మంది పేర్లు కలిగి వున్నవి. ఇది కూడా తప్పడు పత్రమే అని తేలినది.

సదరు శంకరయ్యను విచారించే సమ‌యంలో సదరు శ్రీకాంత్‌ చేత మోసగించబడిన ఏవిధం అనగా తితిదేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి, ద్యోగాలు ఇప్పించకుండా మోసగించాడు అని కె.శివయ్య జెట్టివారిపల్లె, జి.పద్మయ్య మల్లెంపల్లి గ్రామం ఎస్‌.సి కాలని

చిట్వేలి మండలం ఈది లక్ష్మీనారాయణ ఎగువపల్లె చిట్వేలి మండలం, ఆముదాల శంకరయ్య పెద్దూరు స్వయంగా పిర్యాదు చేసినాడు. మాచాని శివనాగేంద్ర పెద్దూరు గ్రామం చిట్వేలి మండలం గుంగటావుల ప్రహల్లాద పెద్దూరు గ్రామం అనువారు స్టేట్‌మెంటు రూపంలో మాకు సమాచారం ఇచ్చినారు. ఈ స్టేట్‌మెంటును పరిశీలించగా సదరు శ్రీకాంత్‌ చేతిలో మోసగింపబడినట్లు తెలుస్తున్నది. సదరు శ్రీకాంత్‌ సృష్టించిన తప్పడు ఐ.డి కార్డు తప్పడు ఉద్యోగ పత్రాలు, బ్యాంకులో డిపాజిట్‌ కొరకు పిలప్‌ చేసిన బ్యాంకు చలానాను జిరాక్స్ మ‌రియు శ్రీకాంత్‌ స్టేట్‌మెంటు హరిప్రసాద్‌ స్టేట్‌మెంటు, హరిప్రసాద్‌ సంతకం చేసిన తప్పుడు ఉద్యోగ పత్రాలలో గమనించడమైనది. రబ్బరు సీలు కూడా తప్పుడుది అని గమనించడం అయింది.

కుంబకోణం శ్రీకాంత్‌, మాచాని హరిప్రసాద్ విచారణ స్టేట్‌మెంటును బట్టి మోసం చేసినట్లుగా అవగతం అవుతున్నది. పై విషయములను తితిదే సివి అండ్‌ ఎస్‌.ఓ శ్రీ మురుగేషన్‌ కుమార్‌సింగ్‌ ఆధ్వర్యములో ఎ.వి. అండ్‌ ఎస్‌.ఓ ఎస్‌. విజయశేఖర్‌, రామచంద్రారెడ్డి, మల్లిఖార్జు, చంద్రనాయక్ రిటైర్డ్‌ డి.ఎస్‌.పి నారాయణస్వామి గైడెన్స్‌తో శ్రీకాంత్‌, హరిప్రసాద్‌లను కకోడూరులో 16-08-2010న అదుపులోకి తీసుకుని కోడూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి వారిపై 468,471,417,420 ఐపిసి కేసు నమోదు పరచి దర్యాప్తు జరిపించారు.
   
ఇలాంటి మోసగాళ్ళ ఉచ్చులో యువతలు పడవద్దని తితిదే నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.