తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 18: పవిత్రమైన ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హించేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన పండితుల నుంచి అంగీకారపత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

హిందూ ధార్మిక ప్రాజెక్టుల‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు ఈ ఏడాది న‌వంబ‌రు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి-517502” అనే చిరునామాకు అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. న‌మూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌డ‌మైన‌ది.

ఇతర వివరాలకు టిటిడి ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయాన్ని 0877-2264519 నంబరులో ప‌నిదినాల్లో కార్యాల‌య వేళ‌ల్లో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.