ENDOWMENT OFFICIALS REVIEW ADMINISTRATIVE ISSUES OF TTD _ టిటిడిలో పాల‌నా అంశాల‌పై దేవాదాయ శాఖ అధికారుల అధ్య‌య‌నం

Tirupati, 18 October 2021: As per directions of AP CM Sri YS Jaganmohan Reddy TTD has been mandated to train the officials of the AP endowment department on the innovative administrative strides of TTD from October 18-22 at SVETA.

 

The objective is that they in turn implement these initiatives in the temples under AP endowment department.

 

As part of the agenda, the officials of the endowment department met TTD JEO Smt Sada Bhargavi on at the TTD administrative building Monday morning.

 

Speaking on the occasion the TTD JEO said the endowment officials will attend a five-day refresher training course at SVETA wherein they will be briefed on all major initiatives of TTD in the realm of devotee welfare and also revenue up-gradation steps.

 

For five days the concerned TTD officials will brief with PPP on relevant issues

 

The training and briefing will be on all aspects like auditing, accounting, hundi collection counting, vigilance and security, Annadanam, Prasadam preparation, modernisation of temple kitchens, to improve temple revenue options, processing of tickets issue, tenders, sanitisation, greenery and garbage clearance.

 

Endowment Joint commissioner Sri Suresh Babu, EE Sri Murali Balakrishna, Deputy Commissioner Sri Vijay Raju, Assistant Commissioners Sri Ramanjaneyulu, Sri Ramesh, Sri Leela Kumar, Sri Ekambaram, TTD additional FA&CAO Sri Ravi Prasad, VGO Sri Manohar, Health officer Dr Sridevi, Chief Information officer Sri ML Sandeep, DyEO (General) Sri Ramana Prasad, Annadanam DyEO Sri Harindranath, Sri Lakshman Naik, OSD Sri GLN Shastri, Parakamani DyEO Sri Venkataiah, SVETA director Dr KRamanjula Reddy were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలో పాల‌నా అంశాల‌పై దేవాదాయ శాఖ అధికారుల అధ్య‌య‌నం

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 18: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో అమ‌లుచేస్తున్న అనేక ప‌రిపాల‌న అంశాల‌ను అధ్య‌య‌నం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆలయాల్లో అమ‌లుచేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం మేర‌కు రెండో విడతలో ఆ శాఖ అధికారులు సోమవారం టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌విని క‌లిశారు. అనంత‌రం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో జెఈవో అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌రిగింది. వీరికి ఈ నెల 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుపతి శ్వేత భవనంలో శిక్షణ ఇస్తారు.

ఈ సంద‌ర్భంగా టిటిడిలో ఆడిటింగ్‌, అకౌంటింగ్‌, హుండీ కానుకల లెక్కింపు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, అన్న‌దానం, ప్ర‌సాదాల తయారీ, వంట‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌, ఆదాయమార్గాలు మెరుగుప‌ర్చ‌డం, టికెట్ల జారీ విధానం, ఐటి, టెండ‌ర్ల నిర్వ‌హ‌ణ‌, పారిశుద్ధ్యం త‌దిత‌ర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా టిటిడి అధికారులు ఈ విభాగాల‌కు సంబంధించిన ప‌రిపాల‌న విధానాల‌ను తెలియజేశారు.

ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీ సురేష్ బాబు, ఈఈ శ్రీ మురళీ బాలకృష్ణ, డెప్యూటీ కమిషనర్ శ్రీ విజయరాజు, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీ రామాంజనేయులు, శ్రీ రమేష్, శ్రీ లీలాకుమార్, శ్రీ ఏకాంబరం, టిటిడి అదనపు ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ రవిప్రసాదు, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అధికారి శ్రీ ఎల్ఎం.సందీప్‌, డెప్యూటీ ఈఓ జనరల్ శ్రీ రమణప్రసాద్, అన్నదానం డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లక్ష్మణ్ నాయక్, ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, శ్వేత సంచాలకులు డా. కె.రామాంజులరెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.