DHANWANTARI HOMAM CONCLUDED IN DHARAMAGIRI VEDA VIJNANA PEETHAM _ తిరుమలలో ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

RITWIKS INVOKE THE BLESSINGS OF LORD DHANWANTARI – THE GOD OF MEDICINE

TO PUT AN END TO COVID 19 MENACE ACROSS THE GLOBE

SVBC RELAYS LIVE TELECAST OF THE MEGA HOMAM WITNESSED BY MILLIONS OF DEVOTEES ACROSS THE GLOBE

Om Dhanwantaraya Vidmahe

Sudhahastaya Dheemahi

Tanno Vishnu Prachodayat Swaaha!

Om Namo Bhagavate Vasudevaya Dhanwantaraye

Amrutakalasahastaya Sarva Bhayaharaaya

Trilokanadhaya Vishnave Swaaha!

Tirumala, 28 Mar. 20: The green environs of Tirumala echoed to the rhythmic chants of Dhanwantari Mantra on Saturday as a part of the Maha Purnahuti observed on the final day of the three day Sri Srinivasa Shantyotsava Sahita Dhanwantari Maha Yagam.

This unique Vaikhanasa Agama fete aimed at invoking the blessings of Sri Dhanwantari-the Lord of Medicine in Hindu Sanatana Dharma which was performed by Ritwiks from Chaturvedas with utmost devotion from March 26 to 28 at Dharmagiri Veda Vijnana Peetham in Tirumala.

Speaking on this occasion, Sri Mohana Rangacharyulu, the Vaikhanasa Agama Advisor to TTD said, among the different utsavas mentioned in Agamas, Dhanwantari Maha Yagam comes under the category of Shantyotsavam, peace, prosperity, health and wealth of the entire humanity.

“In the Seven Maha Yaga Pyres set up in this sacred place, we invoke the blessings of 24 deities to weed off the negative forces and harmful viruses including Covid 19 which are troubling the entire humanity. Dhanwantari Maha Japa Mantra is being recited for eight times by everyone who has directly participated in the ritual as well those who witnessed the fete via SVBC live programme across the world”, he said.   

Sri Sitaramacharuyulu, one of the chief vedic exponents who conducted the Yagam said, on Saturday Maha Purnahuti is observed and the sacred waters which were rendered as Abhishekam to Sri Dhanwantari and Sri Sudarshanamurthy will be mixed in the Theerthas of Tirumala so that these waters will vapourise and reach the Solar system. The rays from lord Surya will suppress the toxic effects of the harmful viruses across the globe and protect the humanity from dreadful Covid 19 Viruses, he added.

Tirumala Pedda Jiyangar, Tirumala Chinna Jiyangar Swamijis, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, DyEO Sri Harindranath, Prinicipal Sri KSS Avadani, Chief Priest of Tirumala Temple Sri Venugopala Dikshitulu, Health Officer Dr RR Reddy, OSD Temple Sri P Seshadri and others were also present.  

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

PURNAHUTHI3

తిరుమలలో ఘ‌నంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం

తిరుమల, 2020 మార్చి 28: విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుండి నిర్వ‌హించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శ‌నివారం మ‌హా పూర్ణాహుతిలో ఘ‌నంగా ముగిసింది. ఈ కార్య క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డితో క‌లిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ మార్చి 25వ తేదీన అంకురార్ప‌ణ‌, మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు, మంత్రాల‌యం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుబుదేంద్ర‌తీర్థ స్వామివార్ల ఆధ్వ‌ర్యంలో ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లు క‌రోనా వ్యాధి సోక‌కుండా ఆరోగ్యంగా సుఖ సంతోషాల‌తో ఉంటార‌న్నారు.

అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో అమృత క‌ళ‌శంతో ఉద్భ‌వించిన ధ‌న్వంత‌రి స్వామివారు ఆయుర్వేద విద్య‌కు ప్ర‌సిద్ధి అని, శ్రీ మ‌హావిష్ణువు అవ‌తార‌మ‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను మూడు రోజుల పాటు దేశంలోని ప్ర‌ముఖ రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు తెలియ‌జేశారు. ఇందులో భాగంగా మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన 30 మంది ప్ర‌ముఖ పండితులు 4 వేదాలు, 5 శాఖ‌ల‌ను పారాయ‌ణం చేశార‌న్నారు.  వేద పండితులు రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో ఆరోగ్యానికి సంబంధించిన మంత్రాలు, మాన‌సిక అందోళ‌న‌లు తొల‌గించే మంత్రాల‌ను ప‌ఠించ‌డం వ‌ల‌న విశ్వంలోని ప్రాణ‌కోటికి హానిక‌లిగించేవి న‌శిస్తాయ‌న్నారు. ధన్వంతరి మహాయాగా ఫ‌లంతో ప్ర‌పంచానికి సంపూర్ణ‌ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాల‌ను ప్ర‌సాదించ‌నున్న‌ట్లు వివ‌రించారు.
     
అనంత‌రం టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆరాధ‌న చేసి హోమాలు, మంత్ర పూరిత‌మైన వాయువుల‌ను స‌మ‌స్త ప్ర‌పంచానికి సూర్య మండ‌లం ద్వారా అందించిన‌ట్లు తెలిపారు. మంత్ర ప‌ఠ‌నాన్ని శ్ర‌వ‌ణం చేసే అవ‌కాశాన్ని వేదంలో క‌లిగించిన‌ట్లు తెలిపారు. స‌మ‌స్త ప్ర‌పంచంలోని వ‌నాలు, ఔష‌దాలు, చెట్లు త‌దిత‌రాలు అంతా ధ‌న్వంత‌రి స్వ‌రూపాల‌న్నారు. క‌రోనా వంటి కంటికి క‌న‌ప‌డ‌ని విప‌త్తు ప్ర‌బ‌లిన‌ప్పుడు ఈ యాగం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉప‌స‌మ‌నం క‌లుగుతుంద‌న్నారు. ఇందులో ప్ర‌పంచంలోని  జీవ‌రాశుల‌ను కాపాడ‌టానికి 24 క‌ళ‌శాల‌లో 24 మంది దేవ‌త‌ల‌ను మంత్ర బంధ‌నంతో ఆవాహ‌నం చేసి జ‌ప హోమాలు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌లు ధ‌న్వంత‌రి మ‌హా మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల‌న స‌మ‌స్త వ్యాధులు న‌యం అవుతాయ‌న్నారు.
ఓం ధ‌న్వానంత‌రాయ విద్మ‌హే
సుధ‌హ‌స్తాయ ధీమ‌హి
త‌న్నో విష్ణుప్ర‌చోద‌యాత్ స్వాహా
ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ధ‌న్వ‌న్త‌ర‌యే
అమృత క‌ళ‌శ హ‌స్తాయ‌
స‌ర్వ భ‌య హ‌రాయ‌
త్రిలోక‌నాధాయ విష్ణ‌వే స్వాహా.

టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ సీతారామాచార్యులు మాట్లాడుతూ ధ‌న్వంత‌రి మ‌హాయాగంలో అత‌ల‌, విత‌ల‌, సుత‌ల‌, త‌లాత‌ల‌, ర‌సాత‌ల, మ‌హాత‌ల‌, పాతాల  వంటి  7 హోమ గుండాలలో హోమాలు నిర్వ‌హించ‌డం ద్వారా 14 లోకాలలోని దేవ‌త‌ల ఆశీస్సులు మాన‌వుల‌కు క‌ల‌గాల‌ని ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేసిన‌ట్లు తెలియ‌జేశారు. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించిన‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్ర‌ధాన కుంభ మంత్ర జలాన్ని ధ‌న్వంత‌రి స్వామివారికి అభిషేకం చేసిన త‌రువాత, ఆ తీర్థ జ‌లాన్నితిరుమ‌ల‌లోని జలాశయంలో కలుపుతామ‌న్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంద‌ని వివ‌రించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి  శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌,  ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి, రుత్వికులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉండాలి –  విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు

తిరుమ‌ల‌లో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హించిన ధన్వంతరి మహాయాగం వ‌ల‌న శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.
         
ఈ సందర్భంగా విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు  భారత ప్రధాన మంత్రి గౌ|| శ్రీ నరేంద్రమోడి, ఆంధ్ర‌, తెలంగాణ‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, గౌ|| శ్రీ కె.చంద్ర‌శేఖ‌ర్‌రావులు దేశ‌, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోర‌కు, స‌మాజం కొర‌కు ప్ర‌జ‌లు త‌మ త‌మ ఇళ్ల‌లో ఉండాల‌ని, బ‌య‌ట‌కు రాకుడ‌ద‌ని, జ‌న‌సందోహం ఉండ‌కూడ‌ద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో టిటిడి మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు  ప్ర‌ముఖ పండితుల‌తో తిరుమ‌ల‌లో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు ధన్వంతరి మహాయాగాన్ని ప్ర‌ముఖ నిష్ణాతులైన పండితుల‌తో టిటిడి అద్భుతంగా నిర్వ‌హించింద‌న్నారు. ఈ యాగం ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సుల‌తో  ప్ర‌పంచ మాన‌వాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ప్ర‌సాదించాల‌న్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.