BALAKANDA CONCLUDES _ తిరుమలలో ముగిసిన బాలకాండ పారాయణం 

AKHANDA SUNDARAKANDA AT DHARMAGIRI ON MAY 16

AYODHYAKANDA TO COMMENCE FROM MAY 17

TIRUMALA, 15 MAY 2023: The Balakanda Parayanam commenced by TTD on July 25 in 2021 on Nada Neerajanam platform in Tirumala seeking the well being of the entire humanity completed on Monday.

Renowned Sanskrit scholar and professor of National Sanskrit University Sri Prava Ramakrishna Somayaji mesmerized the global audience with his expertise in elucidating the shlokas in Balakanda with illustrative examples for nearly two years while Sri Ramanujacharyulu of Dharmagiri Veda Pathashala recited the shlokas with perfect sync.

A total of 2232 shlokas from 77 Chapters of Balakanda were recited for 649 days said Dharmagiri Principal Sri Kuppa Siva Subrahmanya Avadhani speaking on the occasion. 

Scholars Sri Seshacharyulu, Srri Maruti along with the other scholars recited 166 shlokas from 74-77 sargas on Monday. 

Smt Vandana, Music lecturer from SV College of Music and Dance presented Sri Rama Jayarama Sringara Rama in the beginning of the programme and at the end rendered Bhajare Raghuveeram in a melodious manner along with her team.

AKHANDA SUNDARAKANDA PARAYANAM 

On May 16, Sampoorna Akhanda Sundarakanda Parayanam will be rendered with 67 Scholars in Dharmagiri Veda Vignana Peetham between 6am and 11pm continuously for nearly 18 hours.

The SVBC channel under the supervision of its CEO Sri Shanmukh Kumar will live telecast the programme for the sake of global devotees.

AYODHYAKANDA 

On May 17, Ayodhyakanda will commence in Nada Neerajanam between 7am and 8am. This part of epic Ramayana has the maximum number of Shlokas taking the total to 4308.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమలలో ముగిసిన బాలకాండ పారాయణం

– మే 16న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

– మే 17వ తేదీ నుండి అయోధ్య కాండ ప్రారంభం

తిరుమల, 2023 మే 15: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై 2021 జులై 25న ప్రారంభించిన బాలకాండ పారాయణం సోమవారం ఘనంగా ముగిసింది.

తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ, లోక క‌ల్యాణార్థం టీటీడీ నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించిందన్నారు. ఇందులోని ప్ర‌తి శ్లోకం మంత్ర‌మేన‌న్నారు. బాల‌కాండలోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో 2,232 శ్లోకాలను 649 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్ర‌తి శ్లోకానికి అర్థంతోపాటు ప్ర‌స్తుత స‌మాజానికి అన్వ‌యించి పండితులు వ్యాఖ్యానం అందించార‌ని వివ‌రించారు.

శ్రీ బేడి ఆంజనేయ‌స్వామి, శ్రీ‌రాముని అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌మ‌క్షంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై బాలకాండ పారాయ‌ణం చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రామ‌నామ‌స్మ‌ర‌ణ ఎక్క‌డ జ‌రిగితే అక్క‌డ హ‌నుమంతుడు ఉంటార‌ని వాల్మీకి మ‌హ‌ర్షి తెలియ‌జేశార‌ని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజ‌నేయుడు మ‌న‌మ‌ధ్యే ఉన్నార‌ని చెప్పారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారన్నారు.

బాలకాండ పారాయణం నిర్వహించిన ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు డా. ప్ర‌వ రామ‌కృష్ణ సోమయాజులు, ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం పండితులు శ్రీ రామానుజచార్యులు, శ్రీ మారుతి, శ్రీ శేషాచార్యులకు, ఈ కార్య‌క్ర‌మాన్ని కోట్లాది మంది భ‌క్తులకు చేరువ చేసిన‌ ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ కుమార్ కు, అద్భుత‌మైన కీర్త‌న‌లు ఆల‌పించిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. అనంత‌రం పండితుల‌ను, క‌ళాకారుల‌ను స‌న్మానించారు.

బాలకాండలోని 74 నుండి 77వ సర్గ వరకు 4 సర్గలు, యోగ వాశిష్ఠం, ధన్వంతరి మహామంత్రం, అష్టాక్షర శ్రీరామమంత్ర స్త్రోత్రం కలిపి మొత్తం 166 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో పండితులు పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం “శ్రీరామ జయరామ శృంగార రామాయని …….”, కార్యక్రమ ప్రారంభంలో, హైదరాబాద్ కు చెందిన సాంప్రదాయ కళాశాల విద్యార్థుల బృందం “ప్రతి వారం వారం మానస భజారే రఘువీరం ……” సంకీర్తనను చివరిలో ఆలపించారు.

మే 16న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా మే 16వ తేదీ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌ పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది. ఉద‌యం 6 నుండి రాత్రి 11 గంటల వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు 67 మంది ప్రముఖ పండితులు ఈ అఖండ పారాయణ యజ్ఞన్ని కొనసాగిస్తారు.

మే 17 నుండి అయోధ్య కాండ ప్రారంభం

తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై మే 17వ తేదీ నుండి అయోధ్య కాండ పారాయ‌ణం ప్రారంభం కానుంది. ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తుంది. అయోధ్య కాండ‌లో మొత్తం 4,308 శ్లోకాలున్నాయి. ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు రామానుజచార్యులు శ్లోక పారాయ‌ణం చేస్తారు.

పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు, టీటీడీ అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.