GOKULASHTAMI ASTHANAM ON SEPTEMBER 4 AND UTLOTSAVAM ON SEPTEMBER 5 AT TIRUMALA _ తిరుమలలో సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, 5న ఉట్లోత్సవం
Tirumala, September 02, 2026: TTD will observe Gokulashtami Asthanam on September 4, and Utlotsavam on September 5, at Tirumala in view of Sri Krishna Janmastami celebrations.
The Gokulashtami Asthanam will be held in the Bangaru Vakili Mukha Mandapam between 8 PM and 10 PM.
During the event, Sri Krishna Swamy is seated on Sarvabhupala Vahanam and special offerings will be rendered.
Prior to the Asthanam, Ekanta Tirumanjanam (special sacred bath) will be performed for Sri Ugra Srinivasa Murthy, Sri Devi, Bhudevi, and Sri Krishna Swamy, followed by Dwadasaradhana.
On the next day on September 5, the Utlotsavam will be celebrated with celestial grandeur.
At 4PM, Sri Malayappa Swamy on Bangaru Tiruchi accompanied by Sri Krishna Swamy on another Tiruchi will be paraded through the Mada streets.
Youth participates enthusiastically by breaking mud pots (utlu), spreading joy among pilgrims.
In view of these celebrations, TTD has cancelled the Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva scheduled for September 5 at the Tirumala temple.
On the other hand, in view of Sri Krishna Janmastami on September 4, Panchabhishekam will be performed to Sri Kaliya Mardhana Krishna statue between 10 AM and 12noon near Gogarbham Dam, followed by Uttotsavam at the same venue by the Garden Wing of TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమలలో సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, 5న ఉట్లోత్సవం
తిరుమల, 2026 సెప్టెంబర్ 02: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
సెప్టెంబర్ 5న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
అదేవిధంగా సెప్టెంబర్ 4న గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో టిటిడి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం 10 నుండి 12 గంటల వరకు పంచాభిషేకాలు చేస్తారు. అనంతరం ఉట్లోత్సం నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది
