EO INSPECTS FOOD QUALITY TESTING LAB IN TIRUMALA _ తిరుమ‌ల‌లో ఆహార పదార్థాల నాణ్యత పరిశోధ‌న కేంద్రంను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirumala, 3 Jan. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy on Sunday inspected the Food Quality Testing Lab at Tirumala and directed the officials to maintain high-quality standards without any compromise while testing food and water ingredients in the lab.

During his visit, the Health department officials explained how the raw materials used in TTD food produces like laddus, Anna Prasadam, beverages etc. were tested for quality frequently before they are served to the pilgrims. The Lab Analysts also demonstrated the functioning of various equipment used to test the purity of water, milk, ghee, edible oils, dals, millets, rice etc. along with their respective parameters. They explained that 199 ingredients undergo chemical testing and 177 physical testings in the Laboratory which has high testing standards. They also said nearly 1.35lakh samples of various food items will be tested in the lab a year.

The EO and Additional EO also visited the flour mill and also Weather Monitoring Centre at Tirumala and made several suggestions to the staff.

TTD Health Officer Dr RR Reddy, SE-2 Sri Nageswara Rao, EE-1 Sri Jaganmohan Reddy, EE-5 Sri Chandrasekhar, VGOs Sri Bali Reddy, Sri Prabhakar, Unit Officer Sri Srinivasamoorthy, Senior Food Analyst Sri Kedarnath were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో ఆహార పదార్థాల నాణ్యత పరిశోధ‌న కేంద్రంను ప‌రిశీలించిన టిటిడి ఈవో
 
తిరుమల, 2021 జ‌న‌వ‌రి 03: తిరుమల‌‌లోని ఆహార పదార్థాల‌ నాణ్యత పరిశోధ‌న కేంద్రంను టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఆదివారం ప‌రిశీలించారు.  
 
ఈసంద‌ర్భంగా నీరు, అహార పదార్థాల‌ నాణ్యత పరిశోధ‌న కేంద్రంలో తాగునీరు, పాలు, నెయ్యి, నూనెలు, పప్పు దినుసులు, ఇతర అహార పదార్థాల నాణ్యతను ఎలా పరిశీలిస్తారో ఆరోగ్య విభాగం అధికారులు ఈవోకు వివరించారు. అనంత‌రం వాతా‌వ‌ర‌ణ ప‌రిశోధ‌‌న కేంద్రం, పిండిమిల్లుల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.  
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి హెల్త్ ఆఫీసర్ డా. ఆర్.ఆర్. రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ ప్ర‌భాక‌ర్  పాల్గొన్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.