POSTERS RELEASED _ త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 22 Feb. 20: The wall posters of the annual brahmotavams of Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda were released by JEO Sri P Basant Kumar on Saturday.

The important days includes Dhwajarohanam on March 2, Kalyanotsavam and Garuda Seva on March 7, Rathotsavam on March 8, Paruveta Utsavam on March 9, Chakrasnanam on March 10 and Pushpayagam on March 11 will take place in the temple.

DyEOs Sri Yellappa, Smt Kasturi, Sri Govindarajan were also present in the wall poster release event which took place in the chamber of JEO in TTD Administrative Building in Tirupati.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 22: టిటిడికి అనుబంధంగా ఉన్న‌ త‌రిగొండలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌  ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో శ‌నివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 2 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం, మార్చి 7న క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌, మార్చి 8న‌ ర‌థోత్స‌వం, మార్చి 9న పార్వేట ఉత్స‌వం, మార్చి 10న చ‌క్ర‌స్నానం, మార్చి 11న పుష్ప‌యాగం జ‌రుగుతాయ‌ని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి క‌స్తూరి, శ్రీ గోవింద‌రాజ‌న్, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

వాహ‌న సేవ‌ల వివ‌రాలుః

               తేదీ                      ఉదయం                       సాయంత్రం

02-03-2020 (సోమ‌వారం)         ధ్వజారోహణం         హంస వాహనం

03-03-2020 (మంగ‌ళ‌వారం)   ముత్యపుపందిరి వాహనం          హనుమంత వాహనం

04-03-2020 (బుధ‌వారం)        కల్పవృక్ష వాహనం         సింహ వాహనం

05-03-2020 (గురువారం)       తిరుచ్చి వాహనం        పెద్దశేష వాహనం

06-03-2020 (శుక్ర‌వారం)         తిరుచ్చి వాహనం        గజ వాహనం

07-03-2020 (శ‌నివారం)            తిరుచ్చి వాహనం             సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం మరియు గరుడ సేవ

08-03-2020 (ఆదివారం)              రథోత్సవం             ధూళి ఉత్సవం

09-03-2020 (సోమ‌వారం)            సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం మరియు అశ్వవాహనం

10-03-2020 (మంగ‌ళ‌వారం)      వసంతోత్సవం, చక్రస్నానం        తిరుచ్చి ఉత్స‌వం, ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.