TTD CHAIRMAN PROMISES ORGANIC FARMERS OF TTD IN PURCHASING ALL THEIR PRODUCTS _ దిగులొద్దు మీ పంటలన్నీ కొంటాం-. ప్రకృతి వ్యవసాయ రైతుకు టీటీడీ చైర్మన్ భరోసా

Tirupati, 25 August 2022: TTD Chairman assured the organic farmers that there is no need to panic, as TTD would purchase entire organic crops raised by them.

 

His assurance came on Thursday during the training program for Nodal Goshala operators and organic farmers held at the SVETA Bhavan in Tirupati when he went around to visit the several stalls set up in the premises by organic farmers.

 

During his interaction with Sri Jalagam Shyam, an organic farmer from Podi village of Thottabedu Mandal, the farmer explained his travail in growing organic rice and vegetables and facing marketing problems.

 

Later the TTD Chairman assured the organic farmer that TTD would purchase all organic products like jaggery, rice, pulses with MSP. He directed officials concerned on the spot to buy all products of the farmer Sri Shyam and advised other farmers to follow him as an instance.

 

The TTD Chairman and EO also tasted the organic jaggery brought by the farmer Sri Sheshadri Reddy of Mugunta village, SR Puram, Chittoor District.

 

The Chairman also inspected a rangoli drawn by farmers using the Nava Dhanya, leaves and vegetables at the venue.

 

Earlier Nodal Goshala operator Sri Shashidhar, (Nanda Gokul Goshala, SPSR Nellore) Sri Hari Prabhu (ISKCON Goshala, Chinnagottukallu), Sri Hari Krishna Swami (Mukti Dham Goshala, Duvvuru, YSR Kadapa district), Sri Venkata Raghavulu (Ungaturu, West Godavari) were felicitated and presented with a Pancha Gavya medicinal kit and Ayurvedic products of TTD by the Chairman and EO.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దిగులొద్దు మీ పంటలన్నీ కొంటాం

-. ప్రకృతి వ్యవసాయ రైతుకు టీటీడీ చైర్మన్ భరోసా

తిరుపతి  25 ఆగస్టు 2022: ఏం దిగులొద్దు మీరు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతుకు భరోసా ఇచ్చారు .

టీటీడీ శ్వేతా భవనం లో గురువారం గోశాలల నిర్వాహకులు , ప్రకృతి వ్యవసాయ దారుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు . అనంతరం శ్వేతా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు . ఈ సందర్బంగా తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన రైతు శ్రీ జలగం శ్యామ్ టీటీడీ చైర్మన్ తో మాట్లాడారు . తాను గో ఆధారిత వ్యవసాయం తో బియ్యం , కొన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానని చెప్పారు . ఖర్చు ఎక్కువ అవుతోందని , మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని వాపోయారు . బియ్యం కొనుగోలు చేయడానికి జనం పెద్దగా ముందుకు రావడం లేదని , అయినా తాను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నానని ఆవేదన చెందారు . ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే బియ్యం , బెల్లం ,సెనగలు లాంటి పంటలను టీటీడీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు . శ్యాం వద్ద ఉన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు . మరింత మంది రైతులను ప్రోత్సహించాలని శ్రీ శ్యామ్ కు సూచించారు .

చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన రైతు శ్రీ శేషాద్రి రెడ్డి రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకుండా తయారు చేసిన బెల్లం చైర్మన్ , ఈవో కు రుచి చూపించారు . తమకు మద్దతు ధర ఇచ్చి చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు .

ఈ సందర్బంగా రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నవధాన్యాలు , ఆకు కూరలు , కూరగాయలతో వేసిన ముగ్గును చైర్మన్ పరిశీలించారు .

అంతకు ముందు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నోడల్ గోశాలల నిర్వాహకులు శ్రీ శశిధర్ (నంద గోకులం గోశాల నెల్లూరు ) శ్రీ హరి ప్రభు ( ఇస్కాన్ గోశాల చిన్న గొట్టిగల్లు ) శ్రీ హరి కృష్ణ స్వామి (ముక్తి ధామం గోశాల దువ్వూరు వై ఎస్ ఆర్ జిల్లా ) శ్రీ వెంకట రాఘవులు (ఉంగుటూరు పశ్చిమ గోదావరి జిల్లా ) కు చైర్మన్ ,టీటీడీ ఈవో పంచగవ్య మెడిషనల్ కిట్ అందించారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది