TTD EO COMPLIMENTS OFFICIALS ON ENHANCING THE PRODUCE OF DESI COWS _ దేశవాళీ గో జాతుల అభివృద్ధి చర్యలు భేష్ – అధికారులను అభినందించిన టీటీడీ ఈవో

Tirupati, 02 May 2022: TTD EO Dr KS Jawahar Reddy on Tuesday complimented the TTD officials concerned for their exemplary work in multiplying Desi Cows through genetic improvement.

Addressing a review meeting on Gosamrakshana Trust virtually the TTD EO directed the officials to ensure timely and adequate supply of desi cow milk, ghee etc. products needed for daily Srivari naivedyam and Prasadam.

Thereafter he reviewed the applications to Srivani Trust received from all over the state towards the repairs of dilapidated temples in the respective places with its funds.

He asked officials to speed up building of bhajan mandirs in all rural regions of state in co-ordination with state endowment department and expedite sanction of funds.

TTD JEO Sri Veerabrahmam, FA&CAO Sri O Balaji, Chief Engineer Sri Nageswara Rao, Goshala Director Dr Harinath Reddy, Sri Venkateswara Veterinary University VC Dr Padmanabha Reddy, Extension Wing Head Dr Venkat Naidu, Representatives of Pune based D Level institute Sri Vishal were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

దేశవాళీ గో జాతుల అభివృద్ధి చర్యలు భేష్

– అధికారులను అభినందించిన టీటీడీ ఈవో

తిరుపతి 3 మే 2022: తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణ శాలలో దేశ వాళీ గో సంతతిని జన్యు పరంగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను అభినందించారు.

టీటీడీ గోసంరక్షణ ట్రస్ట్ సమావేశం మంగళవారం వర్చువల్ గా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి ఆలయానికి అవసరమైన దేశవాళి ఆవు పాలు, నెయ్యి ఉత్పత్తికి శాస్త్రీయంగా గోవుల సంరక్షణ కోసం కావలసిన వసతి, సదుపాయాల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. గోవుల శాస్త్రీయ పోషణపై ఆయన ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. గోశాలలో అవసరమైన వసతి ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. గోశాల నుంచి రోజుకు నాలుగు వేల లీటర్ల పాల ఉత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈవో చెప్పారు.

అనంతరం శ్రీ వాణి ట్రస్ట్ పై ఈవో సమీక్షించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయాల జీర్ణోద్ధరణ, నిర్మాణం కోసం నిధులను అభ్యర్థిస్తూ అందిన దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాలు నిర్మాణం కోసం దేవాదాయ శాఖ సమన్వయంతో పనులు వేగవంతం చేయాలన్నారు. నిబంధనల.మేరకు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోని పలు ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఎసిఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విసి డాక్టర్ పద్మనాభరెడ్డి, విస్తరణ విభాగం డాక్టర్ వెంకట్ నాయుడు, పూణె కి చెందిన డీ లెవల్ సంస్థ ప్రతినిధులు శ్రీ విశాల్ సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది