LIST OF EVENTS IN THE MONTH OF MAY IN SRI GT _ మే నెలలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUPATI, 03 MAY 2022: The following are the list of events to be observed in Sri Govindaraja Swamy temple in Tirupati during the month of May.
May 5: Sri Bhashyakarulavari Sattumora
May 6: Gandhapodi Utsavam
May 6,13,20,27: Procession of Sri Andal Godai
May 12: Procession of Swamy and Ammavarlu on Uttara Star
May 14: Madhurakavi Alwar Sattumorai
May 16: Garuda Vahana Seva on Pournami
May 21: Procession of Sri Kalyana Venkateswara and Ammavarlu on Sravana star
May 31: Procession of Sri Krishna with Rukmini and Satyabhama on Rohini star
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మే నెలలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2022 మే 03: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 5న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్లవారి శాత్తుమొర. ఉదయం 7.00 గంటలకు శ్రీభాష్యకార్లువారు, సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ భాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
– మే 6న ఆలయంలో గంధపుపొడి ఉత్సవం సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీభాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల దర్శనమివ్వనున్నారు.
– మే 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– మే 12న ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
– మే 14వ తేదీ శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్‌మొరై సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మదురకవి ఆళ్వార్, శ్రీ ఆనంతాళ్వార్‌లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
– మే 16న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గరుడవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిస్తారు.
– మే 21వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
– మే 31వ తేదీ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.