TTD CHAIRMAN VISITS DHARMAGIRI VEDA VIGYNANA PEETHAM _ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 16 Jul. 20: TTD Chairman Sri Y V Subba Reddy on Thursday evening visited the Dharmagiri Veda Vigynana Peetham and participated in the Chatur Veda Parayanam on the occasion of holy Dakshinayana Ekadasi.

The Veda parayanams are being organized since June 1 seeking relief to humanity from pandemic COVID-19. The parayanams include all four Vedas- Rig Veda, Sama Veda, Atharvana Veda, Krishna Yajur Veda and Shukla Yajur Veda parayanams.

Besides 7 Veda Sakhas, 5 Agama Sakhas, 4 Smarta Sakhas, Divya Prabandam, Sri Venkatachala Mahatyam, Srimadramayanam, Sundarakanda, Mahabharata, Bhagavad-Gita, Sri Durga Sapthasati, Astakshari, Dwadashakshari mantra parayanams were performed.

The principal of the Veda Vigynana Peetham, Sri KSS Avadhani explained the significance of daily parayanams to TTD Chairman. Thereafter the chairman interacted with students about classes, study matters and facilities at the Vijnana Peetham.

Veda Vigynana Peetham OSD and Dyeo Sri Vijaya Saradhi accompanied the TTD chairman during his visit.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమ‌ల‌, 16 జూలై‌ 2020: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గురువారం సాయంత్రం తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించారు. ప‌విత్ర‌మైన ద‌క్షిణాయ‌న పుణ్యకాలం ఏకాద‌శి గురువారాన్ని పుర‌స్క‌రించుకుని వేద విజ్ఞాన పీఠంలో నిర్వ‌హించిన చ‌తుర్వేద పారాయ‌ణంలో ఛైర్మ‌న్ పాల్గొన్నారు.

 క‌రోనా విప‌త్తు నుంచి మాన‌వాళిని ర‌క్షించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ జూన్ 1వ తేదీ నుండి ఇక్క‌డ వేద పారాయ‌ణం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం త‌దిత‌ర 7 వేద‌శాఖ‌లు, 5 ఆగ‌మ శాఖ‌లు, 4 స్మార్థ శాఖ‌ల పారాయ‌ణం, దివ్య ప్రబంధం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీమద్రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, మ‌హాభార‌తం, భాగ‌వ‌తం, భ‌గ‌వ‌ద్గీత‌, శ్రీ దుర్గా స‌ప్త‌శ‌తి పారాయ‌ణం, శ‌తంద్రీయం, అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మంత్రాలు పారాయ‌ణం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని వేద విజ్ఞాన పీఠంలో నిత్యం జ‌రుగుతున్న పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఛైర్మ‌న్‌కు వివ‌రించారు. అనంత‌రం త‌ర‌గ‌తి గ‌దుల‌ను, హాస్ట‌ల్‌ను ప‌రిశీలించి విద్యార్థుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను, పాఠ్యాంశాల‌ను ఛైర్మ‌న్ అడిగి తెలుసుకున్నారు.  

ఛైర్మ‌న్ వెంట వేద విజ్ఞాన పీఠం ప్ర‌త్యేకాధికారి మ‌రియు డెప్యూటీ ఈవో శ్రీ విజ‌య‌సార‌థి ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.