TTD CHAIRMAN CONDOLES THE DEMISE OF MALLADI _ నడిచే పురాణ గ్రంథం శ్రీ చంద్రశేఖర శాస్త్రి- టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం

Tirupati, 15 Jan. 22: TTD Trust Board Chairman Sri YV Subba Reddy condoled the demise of versatile veteran scholar Vachaspati, Brahmasri Malladi Chandra Sekhara Shastry.

In his condolence message on Saturday, the TTD Board Chief recalled the connection of Sri Sastry with TTD and described him as a Puranic Encyclopedia.

Malladi Chandrasekhara Sastry was a scholar and television personality who specialized in the Vedas and Puranas texts in Telugu and Sanskrit.

The Dharna Sandehalu programme was telecasted on SVBC where in Sri Shastry answers to the Dharma-related questions is so popular across the globe.

Sri Shastry also served as Principal of Purana Prabodha College run by TTD.

Sri Subba Reddy said Sri Shastry attained salvation after serving Dharma in different roles for nearly six decades and extended condolences to the members of his bereaved family.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నడిచే పురాణ గ్రంథం శ్రీ చంద్రశేఖర శాస్త్రి
– టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యం
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సంతాపం

తిరుమల 15 జనవరి 2022: దివంగత శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.

శ్రీ చంద్ర శేఖర శాస్త్రి పురాణ ప్రవచనానికి ఒక స్థాయి కల్పించిన మహానుభావుడని అన్నారు. టీటీడీ పురాణ ప్రబోధ కళాశాలకు ప్రిన్సిపల్ గా పని చేసిన కాలంలో ఎందరో ఉత్తమ ప్రవచన కర్తలను ఆయన తయారు చేశారని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాన కర్తగా, ధార్మిక ఉపన్యాస కర్తగా స్వామివారి సేవలో తరించారని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేశారన్నారు. 19 సంవత్సరాల వయస్సు లో పురాణ ప్రవచన ప్రయాణం ప్రారంభించిన శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి ఆరు దశాబ్దాల పాటు అనేక రూపాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగించారని శ్రీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. శ్రీ చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శాంతి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు. ఆ కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది