COVID EFFECT – PARUVETA UTSAVAM AND RAMAKRISHNA THEERTHA MUKKOTI IN EKANTAM _ జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం

Tirumala, 15 Jan. 22: Following the increase in Covid cases in Temple City, the Paruveta Utsavam will be observed in Ekantam.

 

Paruveta Utsavam is a traditional annual fete, which is usually observed every year on the auspicious day of Kanuma. As per this unique fest, Sri Malayappa Swamy goes to the deep woods on a mock hunt and hunts wild beasts to protect His devotees.

 

But due to Corona Covid impact, the festival was observed inside Kalyanotsava Mandapam during last year by recreating a forest set up. As the Covid cases are still rampant, TTD has decided to observe this fete in Ekantam this year also akin to last.

 

Similarly, TTD has also decided to observe Sri Ramakrishna Theertha Mukkoti, which is scheduled in Tirumala on January 17 in Ekantam. The devotees are requested to make note of this.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం

జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 15: కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 16వ తేదీ ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంలో పార్వేటు ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు.

కానీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

అదేవిధంగా జనవరి 17న తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.