నారాయ‌ణ‌వ‌నంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలకు అంకురార్ప‌ణ‌

నారాయ‌ణ‌వ‌నంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలకు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 19: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాల‌కు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

సెప్టెంబరు 20న ఒకరోజు పవిత్రోత్సవంలో భాగంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. త‌రువాత ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేప‌డ‌తారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏ ఈ ఓ శ్రీ దుర్గ రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ నాగ‌రాజు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.