TRIAL RUN IN FIRST WEEK OF NEW YEAR _ నెలాఖ‌రులోపు ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి : టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

SRIVARU SAVED US ALL

REPAIRS UNDERWAY IN 14TH AND 15TH KILOMETER

TRIAL RUN IN FIRST WEEK OF NEW YEAR

TIRUMALA, 16 DECEMBER 2021: Reiterating that Srivaru has averted a major accident and saved all when the many tonnes weighing heavy boulder fell somersaulting down second ghat road, said TTD Chairman Sri YV Subba Reddy.

The Chairman had inspected all the roads which are under repair in second ghat road on Thursday evening.

Later speaking to the media he said following the suggestions of IIT experts and the team from Kerala, the repair works in, 7, 8, 9, 14 and 15 kilometres are underway on war-footing. “The works will complete by this year-end and our engineers are working on this day and night. Once the restoration works are completed we will go for a trial run in the first week of the new year 2022 before completing opening it for pilgrims by Vaikuntha Ekadasi”, he added.

Chief Engineer Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EE Sri Surendranath Reddy, VGO Sri Bali Reddy, DyEE Sri Ramana, AVSO 3 Sri Sivaiah were also present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

 

నెలాఖ‌రులోపు ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి : టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 16: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ‌తిన్న‌ రెండో ఘాట్ రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నులను ఈ నెలాఖ‌రులోపు పూర్తి చేసి ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించాల‌ని, వైకుంఠ ఏకాద‌శిలోపు పూర్తిస్థాయిలో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించాల‌ని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. మ‌ర‌మ్మ‌తులు జరుగుతున్న ప్రాంతాల‌ను గురువారం సాయంత్రం ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ వ‌ర్షానికి పెద్ద బండ‌రాళ్లు ప‌డినా స్వామివారి దయవ‌ల్ల ఎవరికీ ప్ర‌మాదం జరగలేదన్నారు. ప‌డిన బండ‌రాళ్ల‌ను పూర్తిస్థాయిలో తొల‌గించామ‌ని, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. 7, 8, 9, 14, 15 కిలోమీట‌ర్ల వ‌ద్ద త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ఐఐటి నిపుణుల సూచ‌న‌ల మేర‌కు ఇంకా బండ‌రాళ్లు ప‌డే ప్రాంతాల‌ను గుర్తించి జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. ఈ ప‌నుల‌న్నింటినీ ఈ నెలాఖ‌రుకు పూర్తి చేసి రెండో ఘాట్ రోడ్డును భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

ఛైర్మ‌న్ వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ సురేంద్ర‌నాథ్ రెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ ర‌మ‌ణ‌ త‌దిత‌రులు ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.