THIRD EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM ON NOVEMBER 2 _ న‌వంబరు 2న మూడ‌వ‌ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

Tirumala, 1 Nov. 21: In order to provide spiritual intervention to humanity against pandemic Corona TTD is organizing the 3rd phase of Akhanda Balakanda Parayanam at Nada Neeranjanam platform in Tirumala on November 2 between 6 am and 8 am.

 

The Vedic pundits of TTD and SV Veda Vignana Peetham, SV Vedic University, National Sanskrit University will recite 163 Shlokas from Sargas 8-13.

 

This program will be telecasted live on SVBC.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబరు 2న మూడ‌వ‌ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుమల, 2021 న‌వంబ‌రు 01: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై న‌వంబరు 2వ తేదీ మంగ‌ళ‌వారం మూడ‌వ‌ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 8 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 8 నుండి 13 సర్గల వ‌ర‌కు గ‌ల 163 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.