DEEPAVALI ASTHANAM IN LOCAL TEMPLES _ న‌వంబ‌రు 4న టిటిడి స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

Tirupati, 1 Nov. 21: The annual Deepavali Asthanam will be observed on November 4 at all local temples of TTD in Tirupati.

In Sri Govindaraja Swamy and Sri Kodanda Rama Swamy temple, Koil Alwar Tirumanjanam will be performed on November 2.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 4న టిటిడి స్థానిక ఆల‌యాల్లో దీపావళి ఆస్థానం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 01: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో న‌వంబ‌రు 4వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో….

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించారు.

దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

న‌వంబ‌రు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు 2న ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో నవంబరు 2న ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. దీపావళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆన‌వాయితీ.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.