‘పాలకమండలిలో ఆదిపత్యపోరు’ అను వార్త సత్యదూరం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, అక్టోబర్‌-20, 2009)

‘పాలకమండలిలో ఆదిపత్యపోరు’ అను వార్త సత్యదూరం

అక్టోబర్‌ 22వ తేదిన ఆంధ్రప్రభ దినపత్రిక జిల్లా స్పెషల్‌ నందు ప్రచురించిన ‘పాపం పసివాళ్ళు’, ‘మహద్వార ప్రవేశం ర‌ద్దు, ‘పాలకమండలిలో ఆదిపత్యపోరు’ అను వార్త సత్యదూరం. అదేవిధంగా ‘చంటిబిడ్డలున్న తల్లితండ్రులకు మహద్వారప్రవేశం రద్దు చేస్తున్నామంటూ టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు నింపాదిగా ప్రకటించారు’ అని ప్రేర్కొనడం సబబుకాదు.

కల్యాణమస్తు మంగళసూత్రాలు శ్రీవారి పాదపద్మాలవద్ద వుంచి పూజలు చేసిన పిదప ఆస్థానమండపంలో విలేఖరులతో తితిదే పాలకమండలి చైర్మన్‌ శ్రీడి.కె.ఆదికేశవులునాయుడు మాట్లాడుతూ శ్రీవారిదర్శనానికి వేచి ఉండే చంటిబిడ్డల తల్లితండ్రులకు వైకుంఠం-| లో చక్కటి సౌకర్యాలు కల్పించి అక్కడి నుండి స్వామి దర్శనానికి పంపితే ఎలావుంటుంది అన్న విషయం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అయితే సదరు పత్రిక నందు చంటి బిడ్డలున్న తల్లితండ్రులకు మహద్వార ప్రవేశం రద్దు చేస్తున్నామంటు ఇఓ ప్రకటించినట్లు, మహద్వార ప్రవేశం విషయం ఇఓకు, పాలకమండలికి మద్య ఆదిపత్యపోరుకు ఆజ్యం పోసిందని అసత్యపు, కల్పిత వార్తలు వ్రాయడం శోచనీయం. మీ దినపత్రిక రిపోర్టర్‌ సదరు విలేఖరుల సమావేశంలో వుండి  చైర్మన్‌గారి వ్యాఖ్యలను ప్రత్యక్షంగా విని తద్విరుద్ధంగా దురుద్దేశ్యంతో వార్త వ్రాయడం బాధాకరం.

కనుక రేపటి మీ దినపత్రిక నందు ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు