SHIVA RIDES PURUSHAMRIGA VAHANAM _ పురుషామృగ‌ వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 12 Mar. 21: Sri Somaskandamurty took celestial ride on Purushamriga Vahana as part of ongoing annual brahmotsavams in the temple on Friday.

Due to Covid restrictions, TTD has been conducting these brahmotsavams in Ekantam.

Deputy EO Sri Subramanyam and others were present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పురుషామృగ‌ వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 12: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి పురుషామృగ వాహనంపై  అనుగ్రహించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.

తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ ఆస్థానం తరువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వ‌ర‌కు శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారికి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

మార్చి 13న త్రిశూలస్నానం :

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 13వ తేదీన త్రిశూలస్నానం ఏకాంతంగా జరుగనుంది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారి ఆస్థానం నిర్వ‌హిస్తారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు త్రిశూల స్న‌ప‌న‌తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు రావణాసుర వాహనం ఆస్థానం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.