TRANSFER ANCIENT KNOWLEDGE TO NEXT-GEN- EO TTD _ పూర్వీకులు అందించిన విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి

Tirupati,23 April 2022: TTD EO Dr KS Jawahar Reddy said it is the bounded duty to preserve ancient knowledge and science that is treasurized in our epics and transfer it to future generations.

 

Speaking after a visit to the Oriental Research Institute at SV University on Saturday evening, the EO said TTD has shouldered the task of digitisation of archaic palm leaf documents for benefit of readers and researchers.

 

He learnt that the SV university’s institute had a treasure of 60,000 palm-leaf documents and 4000 other ancient scripts.

 

The EO asked the university vice-chancellor Acharya Raja Reddy all historic and erudite documents and compendiums in Telugu, Kannada, Sanskrit, Tamil languages comprising Vedas, Upanishads, Ramayana, Mahabharata, Bhagavatam, puranam, Ayurveda, etc. to be digitised for the benefit of knowledge exchange to students and researchers across the world.

 

He also said TTD will lend support to SV Oriental Institute towards digitization.

 

TTD EO also inspected the palm leaf documents digitisation and preservation process at the university.

 

JEO Sri Veerabrahmam, Director of Oriental research institute Sri Surendra Reddy, University advisor Sri Subba Reddy and other officials were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పూర్వీకులు అందించిన విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి

– టీటీడీ స‌హ‌కారంతో తాళపత్ర గ్రంథాల డిజిటైజేెషన్‌

– ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2022 ఏప్రిల్ 23: పూర్వీకులు మనకు అందించిన విజ్ఞానాన్ని పరిరక్షించి, భావితరాలకు అందివ్వాల‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. తిరుప‌తి ఎస్వీ విశ్వ‌విద్యాల‌యంలోని ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌ను శ‌నివారం సాయంత్రం ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ స‌హ‌కారంతో పురాత‌న తాళపత్ర గ్రంథాలను డిజిటైజేెషన్‌ చేసి పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్వీ విశ్వ‌విద్యాల‌యంలో ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌లో 16వ శ‌తాబ్ధం నుండి దాదాపు 60 వేల తాళ‌ప‌త్ర గంథ్రాలు, 4 వేల కాగిత‌పు ప్ర‌తులు ఉన్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌ లైబ్ర‌రీలోని తెలుగు, సంస్కృతం, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోని వేదాలు, ఉప‌నిష‌త్తులు, రామాయ‌ణం, మ‌హా భార‌తం, భాగ‌వ‌తం, పురాణాలు, ఇతిహ‌సాలు, చ‌రిత్ర‌,, వృక్ష శాస్త్రం, ఆయుర్వేదం, ఆముక్తమాల్య‌ద‌, విజ‌య విలాసం, నాగానందం, త‌దిత‌ర అరుదైన గ్రంథాల‌ను ప్ర‌పంచానికి అందివ్వాల‌ని ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాజారెడ్డిని ఈవో కోరారు.

ప్రాచీన తాళ‌ప‌త్ర గ్రంథాల‌ను, డిజిటైజేష‌న్, గ్రంథాల ప‌రిర‌క్ష‌ణ‌ను ఈవో ప‌రిశీలించారు.

జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ డైరెక్ట‌ర్ శ్రీ సురేంద్ర రెడ్డి, విశ్వ‌విద్యాల‌యం స‌ల‌హాదారు శ్రీ సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.